Tarakaratna Wife: నందమూరి తారకరత్న మరణ వార్త నుంచి ఇంకా ఆయన కుటుంబ సభ్యులు కోలుకోలేకపోతున్నారు.ఇలా ఉన్నఫలంగా తారకరత్న గుండెపోటుకు గురై దాదాపు 23 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో ఒక్కసారిగా తన కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. ముఖ్యంగా తన భార్య అలేఖ్య రెడ్డిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.
తారకరత్న బ్రతికున్నప్పుడు కూడా బాలయ్య అండదండలు తారకరత్నకు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆయన మరణం తరువాత తారకరత్న కుటుంబ బాధ్యతలను బాలయ్య తన భుజాలపై వేసుకున్నారు. ఇక తారకరత్న లేరనే వార్తను జీర్ణించుకోలేక అలేఖ్య రెడ్డి ఏకధాటిగా కంటతడి పెట్టడం అందరిని కలిచి వేస్తోంది.ఈ క్రమంలోనే ఆమెను ఈ బాధ నుంచి బయటకు తీసుకువచ్చి తనని తన జీవితంలో బిజీగా ఉంచడం కోసం బాలయ్య ప్రయత్నాలు చేస్తున్నారట.
అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ చంద్రబాబు నాయుడుతో కలిసి అలేఖ్య రెడ్డిని రాజకీయాలలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. తారకరత్నకు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే కోరిక ఉండేది అయితే తన కోరికను తన భార్య అలేఖ్య ద్వారా తీర్చబోతున్నారని తెలుస్తోంది.
ముందుగా అలేఖ్య రెడ్డిని ఈ బాధ నుంచి బయటకు తీసుకురావడం కోసం ఆమెకు తెలుగుదేశం పార్టీలో ఏదైనా మహిళ విభాగంలో ఒక పదవిని ఇప్పించాలని అనంతరం వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాలని ఆలోచనలో బాలకృష్ణ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం గురించి ఇప్పటివరకు ఎక్కడ అధికారక ప్రకటన మాత్రం లేదు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…