దగ్గుబాటి కుటుంబం నుంచి ఇప్పటికి హీరోగా పరిచయమైన రానా విభిన్న పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే రానా సోదరుడు అభిరామ్ కూడా వెండితెర అరంగ్రేటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే అభిరామ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని నటుడిగా తనకు అన్ని రకాల పాత్రల్లో నటించాలని ఉందని తెలిపారు.
గత కొన్ని రోజులుగా అభిరామ్ గురించి క్యాస్టింగ్ కౌచ్, ర్యాష్ డ్రైవింగ్ వంటి ఆరోపణల గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటికి స్పందించిన అభిరామ్ తప్పులు అందరూ చేస్తారు.. నా తప్పులు బయట పడ్డాయి.. వాటి నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానని అభిరామ్ తెలిపారు. నటుడిగా ఎంట్రీ ఇవ్వక ముందే నా ఈ విషయంలో ఇలా జరగడం మంచిదే అయ్యింది. ఇకపై భవిష్యత్తు లో ఇలాంటి తప్పులు చేయకూడదని అర్థమైంది అంటూ అభిరామ్ తెలిపారు.
ఇక సినిమాల విషయానికొస్తే మొదటగా అభి రామ్ ను హీరోగా దర్శకుడు తేజ పరిచయం చేయనున్నారు. నేనే రాజు నేనే మంత్రి సినిమా చేస్తున్న సమయంలో తనే హీరోగా పరిచయం చేయాలని అడిగినప్పుడు అందుకు తేజ గారు కూడా ఒక కథ సిద్ధం చేసినట్లు, ఆ కథ సురేష్ బాబుకు వినిపించగా అతనికి నచ్చడంతో ఆ సినిమా చేయడానికి సురేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలోని ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులు సద్దుమణిగాక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని అభిరామ్ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…