దగ్గుబాటి కుటుంబం నుంచి ఇప్పటికి హీరోగా పరిచయమైన రానా విభిన్న పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే రానా సోదరుడు అభిరామ్ కూడా వెండితెర అరంగ్రేటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే అభిరామ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని నటుడిగా తనకు అన్ని రకాల పాత్రల్లో నటించాలని ఉందని తెలిపారు.

గత కొన్ని రోజులుగా అభిరామ్ గురించి క్యాస్టింగ్ కౌచ్, ర్యాష్‌ డ్రైవింగ్ వంటి ఆరోపణల గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటికి స్పందించిన అభిరామ్ తప్పులు అందరూ చేస్తారు.. నా తప్పులు బయట పడ్డాయి.. వాటి నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానని అభిరామ్ తెలిపారు. నటుడిగా ఎంట్రీ ఇవ్వక ముందే నా ఈ విషయంలో ఇలా జరగడం మంచిదే అయ్యింది. ఇకపై భవిష్యత్తు లో ఇలాంటి తప్పులు చేయకూడదని అర్థమైంది అంటూ అభిరామ్ తెలిపారు.

ఇక సినిమాల విషయానికొస్తే మొదటగా అభి రామ్ ను హీరోగా దర్శకుడు తేజ పరిచయం చేయనున్నారు. నేనే రాజు నేనే మంత్రి సినిమా చేస్తున్న సమయంలో తనే హీరోగా పరిచయం చేయాలని అడిగినప్పుడు అందుకు తేజ గారు కూడా ఒక కథ సిద్ధం చేసినట్లు, ఆ కథ సురేష్ బాబుకు వినిపించగా అతనికి నచ్చడంతో ఆ సినిమా చేయడానికి సురేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలోని ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులు సద్దుమణిగాక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని అభిరామ్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here