Abhishek Bachchan: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏదో ఒక వార్త ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇన్ని రోజులు బాయికాట్ బాలీవుడ్ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో బాయ్ కాట్ ట్రెండ్ నడిచింది అయితే ప్రస్తుతం విడాకుల ట్రెండ్ నడుస్తోంది.ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోగా తాజాగా మరి కొంతమంది విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ దీపికా పదుకొనేవిడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు రావడంతో ఈ వార్తలపై స్పందించిన రణవీర్ అలాంటిది ఏమీ లేదని కొట్టి పారేశారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కపుల్ గా ఉన్నటువంటి ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారంటూ ఇప్పుడు కాదు ఎప్పటినుంచో వీరివిడాకుల గురించి వైరల్ అవుతుంది.
ఈ క్రమంలోనే ఈ విడాకుల వార్తలపై గతంలో అభిషేక స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే మరోసారి ఈయన తనదైన స్టైల్ లో విడాకుల గురించి స్పందిస్తూ.. బాలీవుడ్ మీడియాకి భారీగా కౌంటర్ ఇచ్చారు.ఈ క్రమంలోనే అభిషేక్ బచ్చన్ విడాకులపై స్పందిస్తూ తనకు విడాకులు ఇవ్వాలని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు అంటూ ఈయన చెప్పుకొచ్చారు.
విడాకులు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని అయితే తనకు రెండో పెళ్లి కూడా చేసే బాధ్యత మీదే అంటూ ఈ సందర్భంగా ఈయన మీడియాపై మండిపడ్డారు. ఈ విధంగా విడాకుల గురించి స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేయగా విరి విడాకులు వార్తలు కేవలం అవాస్తవాలేనని ఇందులో ఎలాంటి నిజం లేదని అర్థమవుతుంది.ఇక ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ 2007వ సంవత్సరంలో వివాహం చేసుకోగా వీరిద్దరికి ఆరాధ్య అనే ఒక కుమార్తె కూడా ఉంది తరచూ వీరిద్దరూ పలు కార్యక్రమాలలో సందడి చేస్తున్నప్పటికీ వీరి విడాకులు గురించి వార్తలు రావడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…