Categories: FeaturedGeneral News

వేగంగా వ్యాప్తి చెందుతున్న జికా… లక్షణాలు ఇవే?

కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న భారతదేశంలో మరో వైరస్ ప్రజల పై విరుచుకు పడటానికి సిద్ధంగా ఉంది.తాజాగా కేరళ రాష్ట్రంలో ప్రమాదకర జికా వైరస్‌ కేసులు బయటపడటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. శుక్రవారం ఎయిమ్స్‌కు చెందిన ఆరుగురు నిపుణుల బృందాన్ని కేరళ రాష్ట్రానికి పంపించి పరిస్థితులను అధ్యయనం చేస్తోంది ఇలాంటి తరుణంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జికా వైరస్ ను ఎదుర్కోవడానికి అప్రమత్తం అవుతున్నాయి. అసలు జికా వైరస్ అంటే ఏమిటి ? అది ఎలా వ్యాపిస్తుంది? ఎవరి పైన ఎక్కువ ప్రభావం? చూపిస్తుంది అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జికా వైరస్ దోమ కాటు వలన మనుషులకు వ్యాప్తి చెందుతుంది.ముఖ్యంగా అడ ఏడిస్ ఈజిప్ట్ దోమ కాటు ద్వారా జికా వైరస్ మనుషుల్లో వ్యాప్తి చెందుతుంది. అలాగే లైంగిక ప్రక్రియ ద్వారా వ్యాప్తి జరుగుతుందని చెప్తున్నప్పటికీ ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు ఇప్పటివరకు లేవు ఉగాండాలోని జికా అడవిలో ఉండే కోతుల్లో జికా వైరస్‌ను మొదట కనుగొన్నారు.1952లో తొలిసారిగా ఉగాండా, టాంజానియా వంటి దేశాల్లో మనుషులకు జికా వైరస్‌ సోకింది. తర్వాత అనతికాలంలోనే ప్రపంచదేశాలన్నీ వణికించే మహమ్మారిగా జికా వైరస్ మారింది

జికా వైరస్ లక్షణాలు విషయానికొస్తే చాలామందిలో బయటకు ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. కాకపోతే కొద్దిపాటి జ్వరం, వంటిపై దద్దుర్లు, కీళ్ళ నొప్పులు, కళ్ళుఎర్రబడటం వంటి లక్షణాలు కనపడతాయి. ఒక్కోసారి వైరస్ లక్షణాలు బయటపడడానికి వారం రోజులు కూడా పట్టొచ్చు. ముఖ్యంగా జికా వైరస్ గర్భిణులకు ప్రమాదంగా మారుతోంది. ఈ వైరస్ గర్భిణుల నుంచి పిల్లలకు సోకితే మైక్రోసెఫలీ అనే వ్యాధి పుట్టబోయే పిల్లల మెదడు ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కాబట్టి గర్భిణీలు అత్యంత జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి. ఇప్ప‌టివ‌ర‌కు జికా వైర‌స్‌కి ప్ర‌త్యేకంగా మందులు కానీ, వ్యాక్సిన్లు కానీ లేవు. ఈ వ్యాధి బారిన పడితే బాగా విశ్రాంతి తీసుకుంటూ జ్వ‌రం, నొప్పుల‌ను త‌గ్గించే మందులు వాడాలి. దోమల కాటుకు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టి కోవాలి, పరిసరాల శుభ్రత, వ్యక్తిగత శుభ్రత పాటించడం తప్పనిసరి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago