కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న భారతదేశంలో మరో వైరస్ ప్రజల పై విరుచుకు పడటానికి సిద్ధంగా ఉంది.తాజాగా కేరళ రాష్ట్రంలో ప్రమాదకర జికా వైరస్ కేసులు బయటపడటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. శుక్రవారం ఎయిమ్స్‌కు చెందిన ఆరుగురు నిపుణుల బృందాన్ని కేరళ రాష్ట్రానికి పంపించి పరిస్థితులను అధ్యయనం చేస్తోంది ఇలాంటి తరుణంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జికా వైరస్ ను ఎదుర్కోవడానికి అప్రమత్తం అవుతున్నాయి. అసలు జికా వైరస్ అంటే ఏమిటి ? అది ఎలా వ్యాపిస్తుంది? ఎవరి పైన ఎక్కువ ప్రభావం? చూపిస్తుంది అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జికా వైరస్ దోమ కాటు వలన మనుషులకు వ్యాప్తి చెందుతుంది.ముఖ్యంగా అడ ఏడిస్ ఈజిప్ట్ దోమ కాటు ద్వారా జికా వైరస్ మనుషుల్లో వ్యాప్తి చెందుతుంది. అలాగే లైంగిక ప్రక్రియ ద్వారా వ్యాప్తి జరుగుతుందని చెప్తున్నప్పటికీ ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు ఇప్పటివరకు లేవు ఉగాండాలోని జికా అడవిలో ఉండే కోతుల్లో జికా వైరస్‌ను మొదట కనుగొన్నారు.1952లో తొలిసారిగా ఉగాండా, టాంజానియా వంటి దేశాల్లో మనుషులకు జికా వైరస్ సోకింది. తర్వాత అనతికాలంలోనే ప్రపంచదేశాలన్నీ వణికించే మహమ్మారిగా జికా వైరస్ మారింది
జికా వైరస్ లక్షణాలు విషయానికొస్తే చాలామందిలో బయటకు ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. కాకపోతే కొద్దిపాటి జ్వరం, వంటిపై దద్దుర్లు, కీళ్ళ నొప్పులు, కళ్ళుఎర్రబడటం వంటి లక్షణాలు కనపడతాయి. ఒక్కోసారి వైరస్ లక్షణాలు బయటపడడానికి వారం రోజులు కూడా పట్టొచ్చు. ముఖ్యంగా జికా వైరస్ గర్భిణులకు ప్రమాదంగా మారుతోంది. ఈ వైరస్ గర్భిణుల నుంచి పిల్లలకు సోకితే మైక్రోసెఫలీ అనే వ్యాధి పుట్టబోయే పిల్లల మెదడు ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కాబట్టి గర్భిణీలు అత్యంత జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి. ఇప్పటివరకు జికా వైరస్‌కి ప్రత్యేకంగా మందులు కానీ, వ్యాక్సిన్లు కానీ లేవు. ఈ వ్యాధి బారిన పడితే బాగా విశ్రాంతి తీసుకుంటూ జ్వరం, నొప్పులను తగ్గించే మందులు వాడాలి. దోమల కాటుకు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టి కోవాలి, పరిసరాల శుభ్రత, వ్యక్తిగత శుభ్రత పాటించడం తప్పనిసరి.































