Movie News

పెళ్లి మాత్రమే చేస్తారా.. శోభనం కూడా చూపించండి.. జబర్దస్త్ స్కిట్స్‌పై ఫైర్!

బుల్లితెరలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ షో మొదట్లో మంచి ఆదరణ పొందింది. కానీ రాను రాను రేటింగ్ కోసం ఎంతటి దానికైనా దిగజారుతుంది. ఈటీవీలో మల్లెమాల ప్రొడక్షన్ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో పై నెటిజన్లు తెగ మండిపడుతున్నారు. అంతేకాకుండా మల్లెమాల ప్రొడక్షన్ పై కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ షోని చూసి మరిన్ని బుల్లితెర షోలు కూడా తమ రేటింగ్ కోసం బాగా దిగజారుతుంది.

ఇప్పటికే జబర్దస్త్ లో రేటింగ్ కోసం యాంకర్ రష్మీ, కమెడియన్ సుధీర్ ను జోడిని ముందుంచారు. ఇక వీళ్ళు నిజంగా ప్రేమలో ఉన్నారా అన్నట్లు ప్రేక్షకులలో ఆలోచనలు మొదలయ్యేలా చేశారు. అంతేకాకుండా గతంలో వీరి పెళ్లి కూడా బుల్లితెర వేదికగా చేయగా అదంతా నిజం కాదని కేవలం రేటింగ్ కోసమని ప్రేక్షకులను పిచ్చోళ్లను చేశారు. నిజానికి ఏదైనా ఒక్కసారి చేస్తే కాస్త ఆసక్తిగా అనిపిస్తుంది. కానీ అదే మళ్ళీ మళ్ళీ చేస్తే మాత్రం ఆ షో విమర్శలు ఎదుర్కోక తప్పదు.

jabardasth

ఇదిలా ఉంటే తాజాగా వచ్చే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలయింది. ఇక ఇందులో కూడా మళ్లీ పెళ్లి స్కిట్ చేశారు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్. ఇందులో వీరికి జంటగా సోషల్ మీడియా స్టార్ దీపిక పిల్లి, యాంకర్ రష్మీ పెళ్లి కూతుర్ల గెటప్ లో కనిపించారు. వీళ్లను చూసి సుధీర్, ఆది తమ డైలాగ్స్ తో రెచ్చిపోయారు. సుధీర్ మరింత ఓపెన్ గా మాట్లాడుతూ పదిన్నర అయింది ఏమీ లేదా అని అనడంతో ఈ ప్రోమోను చూసిన నెటిజన్లు తెగ మండిపడుతున్నారు. హైపర్ ఆది రాసిన ఈ స్కిట్ కు మల్లెమాల పై కూడా టార్గెట్ పడినట్లు తెలుస్తుంది.

ఇక నెటిజన్లు ఇటువంటివి చూడలేక.. మల్లెమాల అంటే మల్లెలు, మాలలు అర్థం వచ్చేటట్లు.. మల్లెమాలా? పెళ్లిళ్ల బ్రోకరా? అంటూ శోభనం చేసేది కూడా పెట్టండి అని ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తూ ఫైర్ అవుతున్నారు. నిజానికి ఫ్యామిలీతో కలిసి చూసే ఈ షో లలో ఇటువంటివి స్కిట్ లను చేయడం సరైనది కాదని గతంలో జబర్దస్త్ కు విమర్శలు ఎదురుగా మళ్లీ అలాంటి స్కిట్ లతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కిచెన్‌కు దూరంగా రానా భార్య.. అత్తగారి వంటపై షాకింగ్ కామెంట్స్!

సినీ తారల వ్యక్తిగత జీవితంపై ప్రేక్షకులకు ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వారి రోజువారీ అలవాట్లు, కుటుంబ సంబంధాలు, ఇంటి…

4 hours ago

ఆ ఒక్క పాటే జీవితం మార్చింది.. 60 పాటలు చేసిన డ్యాన్సర్ కథ..!

డిజిటల్ యుగంలో ఫోక్ సాంగ్స్‌కు పెరుగుతున్న ఆదరణతో పాటు, కొత్త టాలెంట్‌కు కూడా విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ఈ ట్రెండ్‌లోనే…

4 hours ago

జబర్దస్త్‌లో 108 ఎపిసోడ్లు చేసిన నటుడు.. ఇప్పుడు షాప్ నడుపుతున్నాడు

సినీ పరిశ్రమలో ప్రతిభ ఒక్కటే సరిపోదు.. అదృష్టం కూడా తోడైతేనే కెరీర్ సాఫీగా సాగుతుంది. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు…

5 hours ago

శ్రీహరికి అలా చెప్పిన డిస్కో శాంతి.. తర్వాత అభిప్రాయం మారింది ఎందుకు?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమా టాలీవుడ్‌లో మైలురాయిగా నిలిచిన…

5 hours ago

ఆ హీరో నా పక్కన ఉంటే చాలు.. ఏదైనా చేయగలను.. రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్..

ప్రసిద్ధ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినిమా ప్రయాణం, అలాగే ప్రముఖ నటుడు జూనియర్…

5 hours ago

4 గంటల పాటు గాల్లోనే ఫ్లైట్.. భయంతో కన్నీళ్లు పెట్టుకున్న మహిళ..

హైదరాబాద్ నుంచి హుబ్లీకి బయల్దేరిన ఫ్లై91 ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అనూహ్య పరిస్థితుల్లో నాలుగు గంటల పాటు గాల్లోనే తిరుగుతూ…

5 hours ago