Aacharya trailer confused mega fans : ఓటమి లేని దర్శకుడిగా కొరటాలకు మంచి పేరుంది. మిర్చి నుండి ఇప్పటి వరకు ఒక్కసినిమా కూడా పరాజయం పొందలేదు. ఇక అలాంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కాంబినేషన్లో మెగాస్టార్ సినిమా అంటే అభిమానుల అంచనాలు మాములుగా ఉండవు అసలే సందేశాత్మక చిత్రాన్ని కమర్షియల్ వాసనతో చూపించే కొరటాల మాస్ హీరోని ఇంకెలా చూపిస్తాడో అని అభిమానులు ఎదురుచూశారు. ఇక అందులోను మెగాస్టార్ తో పాటు ఫాన్స్ కి మరో బోనస్ రామ్ చరణ్ తేజ్.
మెగా పవర్ స్టార్ తన తండ్రితో ఫుల్ లెన్త్ పాత్రలో నటించడం ఇది తొలిసారి దీంతో అభిమానుల అంచనాలు ఆకాశానంటాయి. కొరటాల కూడా సినిమా విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాడు. ఇక ఇంతవరకు ప్రతి సినిమా హిట్ అందుకే ఈ సినిమా విషయంలో ఎక్కువ కేర్ తీసుకున్నాడట. ఇక సినిమా విడుదల దగ్గరపడటంతో థియేరిటికల్ ట్రైలర్ ను విడుదల చేసారు.
మెగా అభిమానులను ట్రైలర్ ఆకట్టుకుందా…..
ఆచార్య సినిమా అనేది మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన సినిమా. కానీ, ట్రైలర్ కటింగ్ మాత్రం చరణ్‌తో మొదలవడం కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది. చాలా రోజుల తర్వాత మెగాస్టార్ తెరమీద కనిపించడం హైలైట్ గా దర్శకుడు చూపిస్తాడని భావించిన అభిమానులకు చిరంజీవి ఎంట్రీ అంతగా ఆకట్టుకోలేదు. ఇక చరణ్ ను ఫస్ట్ చూపించడం మరియు ఎక్కువ చూపించడంతో అభిమానుల్లో కన్ఫ్యూషన్ మొదలైంది. అసలు ఇందులో ఎవరు మెయిన్ హీరో చరణా లేక చిరంజీవినా అన్న అనుమానం అభిమానుల్లో వచ్చింది.ఆర్ఆర్ఆర్ సినిమా భారీ సక్సెస్ కారణంగా చరణ్‌ను హైలెట్ చేస్తూ ఇంకా ఉత్తరాది ప్రేక్షకులను, వసూళ్ళను టార్గెట్ చేస్తూ ఈ ట్రైలర్ కట్ చేసి ఉండొచ్చుననే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ట్రైలర్ ప్రారంభం లో చరణ్ కంటే చిరు కనిపిస్తే వచ్చే హైప్ మరోలా ఉండేది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…