Movie News

Actor Ajay: డబ్బుల్లేక హోటల్లో గిన్నెలు కడిగాను… గడ్డు పరిస్థితులను తలుచుకున్న నటుడు అజయ్!

Actor Ajay: సినిమా ఇండస్ట్రీలో విలన్ గా హీరో ఫ్రెండ్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు అజయ్ ఒకరు. ఈయన ఎన్నో సినిమాలలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంతో గొప్ప స్థానంలో ఉన్నప్పటికీ వారు ఆ స్థాయికి రావడానికి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే ఉంటారు. అయితే సమయం వచ్చినప్పుడు అలాంటి ఇబ్బందులను బయటపెడుతూ ఉంటారు.

ఈ క్రమంలోనే నటుడు అజయ్ తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా ఈయన తన సినీ కెరియర్లో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి గుర్తు చేసుకున్నారు. తను చాలా హైట్ ఉండటంవల్లే ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు. అయితే తాను నటించిన కొన్ని పాత్రలు చూసి బయట కూడా తనని చూస్తే భయపడేవారని తెలిపారు.

ముఖ్యంగా రవితేజ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన విక్రమార్కుడు సినిమాలో తాను నటించిన తిట్ల పాత్ర చూసి పిల్లలు తన వద్దకు రావడానికి భయపడేవారని అజయ్ తెలిపారు. ఇక తాను ఒకసారి నేపాల్ వెళ్లానని అయితే నేపాల్ వెళ్లిన తర్వాత తన దగ్గర డబ్బులు లేకపోవడంతో ఓ రెస్టారెంట్లో గిన్నెలు కడిగానని అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

Actor Ajay: తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాను…

ఇక సినిమా షూటింగులు జరిగేటప్పుడు ప్రమాదాలు జరగడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే తాను ఒక సినిమా షూటింగ్ నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డానని తెలిపారు.ఇక విలన్ పాత్రలలో నటించేటప్పుడు కొన్నిసార్లు రేప్ సీన్లలో కూడా నటించాలి. అయితే ఆ సమయంలో ఎలా నటించాలో తనకు కాస్త భయంగానే ఉండేది అంటూ ఈ సందర్భంగా అజయ్ సినిమాల గురించి పలు విషయాలను తెలియచేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago