Anchor Sreemukhi: యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి ప్రస్తుతం ప్రతి ఒక్క ఛానల్ లోనూ ఒకటి లేదా రెండు ప్రోగ్రాములు ద్వారా ఎంతో బిజీగా గడుపుతున్నారు. మొత్తానికి బుల్లితెర చానల్స్ అన్నింటిలోనూ వరుస కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. అయితే యాంకర్ గా ఎంతో బిజీగా ఉన్నటువంటి శ్రీముఖి పెళ్లి గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇలా సోషల్ మీడియా వేదికగా శ్రీముఖి పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నోసార్లు వార్తలు రావడంతో ఈ పెళ్లి వార్తలపై శ్రీముఖి స్పందించి అవన్నీ అవాస్తవాలను కొట్టి పారేశారు.ఇకపోతే తాజాగా మరోసారి ఈమె పెళ్లి వార్త వైరల్ గా మారింది. ఈమె హైదరాబాద్ కి చెందిన ఒక వ్యాపారవేత్తతో పెళ్లికి సిద్ధమైందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ వార్తలపై శ్రీముఖి స్పందిస్తూ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు.
ఈ సందర్భంగా శ్రీముఖి స్పందిస్తూ నా పెళ్లి గురించి చాలా దారుణమైన వార్తలు వస్తున్నాయి. ఏకంగా తన తండ్రి ఫోటోని కాస్త బ్లర్ చేసి శ్రీముఖి పెళ్లి చేసుకోబోయే అబ్బాయిలు తనే అంటూ థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. ఇది చాలా దారుణం తండ్రితో పెళ్ళంటూ వార్తలు రాయడం ఏంటి అంటూ ఈమె మండిపడ్డారు.
ప్రస్తుతం తాను వరుస టీవీ షో లతో చాలా బిజీగా ఉన్నానని,ప్రస్తుతం తన లైఫ్ చాలా హ్యాపీగా ఉందని తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని ఆలోచనలు కూడా లేవంటూ ఈ సందర్భంగా రాములమ్మ పెళ్లి గురించి వచ్చే వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఇక మరో మూడు నాలుగు సంవత్సరాల పాటు తను పెళ్లి గురించి ఆలోచించనంటూ ఈమె పెళ్లి వార్తలపై మరోసారి స్పందించి క్లారిటీ ఇచ్చారు.
భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…