Movie News

Balakrishna: చంఘీజ్‌ ఖాన్‌ పాత్రలో నటించాలని ఉంది… డ్రీం ప్రాజెక్ట్ బయటపెట్టిన బాలయ్య!

Balakrishna: బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన గత ఏడాది అఖండ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన వీర సింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుంది.

ఇకపోతే ఇదివరకు బాలకృష్ణ తన డ్రీం ప్రాజెక్టు నర్తనశాల గురించి పలు సందర్భాలలో తెలియచేశారు. అయితే ఈ సినిమా కొన్ని కారణాలవల్ల షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. అయితే వీరసింహారెడ్డి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా బాలకృష్ణ తన మనసులో ఉన్నటువంటి కోరికను తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి బయట పెట్టారు.

బాలకృష్ణ మాట్లాడుతూ ఎప్పటికైనా చెంఘీజ్‌ ఖాన్‌ సినిమా చేస్తానని అదే తన జీవితాశయం అంటూ తెలియజేశారు. మంగోల్‌ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి చెంఘీజ్‌ ఖాన్‌. తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసం ఈయన ఎన్నో దండయాత్రలు చేశారు.ఈయన ఏ రాజ్యంపై అయిన దండయాత్ర చేశారంటే తన సైన్యం అక్కడ ఉన్నటువంటి మహిళలను ఎత్తుకెళ్లి దారుణంగా ప్రవర్తించేవారు. అందుకే ఎంతో మంది రాజులు సామంతులుగా మారిపోయేవారట.

Balakrishna: బాలయ్య డ్రీం ప్రాజెక్టు డైరెక్టర్ అతనేనా…

చెంఘీజ్‌ ఖాన్‌ గురించి, అతడి సామ్రాజ్యం గురించి ఎక్కడా సరైన సమాచారం లేదు. ఇలాంటి ప్రతినాయక లక్షణాలు ఉన్న వ్యక్తిపై సినిమా చేయాలని బాలయ్య అనుకోవడంతోనే ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతుంది అయితే ఇలాంటి విభిన్నమైన సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయం గురించి కూడా చర్చలు మొదలయ్యాయి. కొందరు క్రిష్ పేరు బయట పెడుతూ ఉండగా మరికొందరు రాజమౌళి అయితే ఇలాంటి సినిమాలను అద్భుతంగా రూపొందిస్తారని భావిస్తున్నారు. మరి బాలయ్య డ్రీం ప్రాజెక్టు డైరెక్టర్ చేసే అవకాశం ఎవరు అందుకుంటారో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తిరుమలకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. ప్రతిరోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం..!

తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులతో వచ్చే కుటుంబాలకు…

1 hour ago

పల్లీ వర్సెస్ బాదం..ఆరోగ్యానికి అసలు ఏది బెస్ట్?

ఆరోగ్యకరమైన ఆహారం గురించి మాట్లాడినప్పుడు ముందుగా గుర్తుకొచ్చే పదార్థాల్లో బాదం, వేరుశెనగలు తప్పకుండా ఉంటాయి. చాలా మంది ప్రతి రోజు…

2 hours ago

నటితో అనుసంధానం చేస్తూ సీఎం విజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. మాజీ మంత్రిపై కేసు

తమిళనాడు రాజకీయాలు మరోసారి తీవ్ర వేడిని సంతరించుకున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు రోజురోజుకూ ముదురుతున్న…

20 hours ago

అరుదైన గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి పరస్పర దృష్టులు మనిషి జీవితంపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. గ్రహాల ప్రత్యేక కలయికల…

21 hours ago

బంగారం ధరలు భారీగా పతనం.. ఒక్కరోజులోనే వేల రూపాయల తగ్గుదల.. తాజా ధరలు ఇవే!

బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ ఊరట లభించింది. గత కొన్ని వారాలుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న పసిడి…

21 hours ago

పెరుగులో ఉప్పు మంచిదా? చక్కెర మంచిదా? ఆరోగ్య నిపుణులు చెప్పే అసలు నిజం ఇదే!

భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…

2 days ago