Balakrishna: బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన గత ఏడాది అఖండ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన వీర సింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుంది.

ఇకపోతే ఇదివరకు బాలకృష్ణ తన డ్రీం ప్రాజెక్టు నర్తనశాల గురించి పలు సందర్భాలలో తెలియచేశారు. అయితే ఈ సినిమా కొన్ని కారణాలవల్ల షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. అయితే వీరసింహారెడ్డి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా బాలకృష్ణ తన మనసులో ఉన్నటువంటి కోరికను తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి బయట పెట్టారు.
బాలకృష్ణ మాట్లాడుతూ ఎప్పటికైనా చెంఘీజ్ ఖాన్ సినిమా చేస్తానని అదే తన జీవితాశయం అంటూ తెలియజేశారు. మంగోల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి చెంఘీజ్ ఖాన్. తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసం ఈయన ఎన్నో దండయాత్రలు చేశారు.ఈయన ఏ రాజ్యంపై అయిన దండయాత్ర చేశారంటే తన సైన్యం అక్కడ ఉన్నటువంటి మహిళలను ఎత్తుకెళ్లి దారుణంగా ప్రవర్తించేవారు. అందుకే ఎంతో మంది రాజులు సామంతులుగా మారిపోయేవారట.

Balakrishna: బాలయ్య డ్రీం ప్రాజెక్టు డైరెక్టర్ అతనేనా…
చెంఘీజ్ ఖాన్ గురించి, అతడి సామ్రాజ్యం గురించి ఎక్కడా సరైన సమాచారం లేదు. ఇలాంటి ప్రతినాయక లక్షణాలు ఉన్న వ్యక్తిపై సినిమా చేయాలని బాలయ్య అనుకోవడంతోనే ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతుంది అయితే ఇలాంటి విభిన్నమైన సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయం గురించి కూడా చర్చలు మొదలయ్యాయి. కొందరు క్రిష్ పేరు బయట పెడుతూ ఉండగా మరికొందరు రాజమౌళి అయితే ఇలాంటి సినిమాలను అద్భుతంగా రూపొందిస్తారని భావిస్తున్నారు. మరి బాలయ్య డ్రీం ప్రాజెక్టు డైరెక్టర్ చేసే అవకాశం ఎవరు అందుకుంటారో తెలియాల్సి ఉంది.




























