Balakrishna: బాలకృష్ణ ఈ సంక్రాంతి కానుక వీరసింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒంగోలులో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన విషయం మనకు తెలిసిందే.
ఇక ఒంగోలులో ఈ వేడుక కోసం బాలకృష్ణ హీరోయిన్ శృతిహాసన్ తో కలిసి ప్రత్యేకంగా హెలికాప్టర్ లో అక్కడికి వచ్చారు. ఒంగోలులో సాయంత్రం ఈ వేడుక ముగిసిన అనంతరం బాలకృష్ణ ఒంగోలులోనే ఆరోజు రాత్రికి బస చేశారు. అనంతరం మరుసటి రోజు హెలికాప్టర్లో హైదరాబాద్ తిరుగు ప్రయాణం మొదలవగా హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలలోనే సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి.
హెలికాప్టర్ లో తలెత్తిన ఈ సాంకేతిక సమస్యను ముందుగానే గుర్తించిన పైలెట్ హెలికాప్టర్ ను ఎమర్జెన్సీ లాండింగ్ చేశారు. ఇలా ఒంగోలులోనే హెలికాప్టర్ ల్యాండింగ్ అయిన అనంతరం హెలికాప్టర్ లో తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిశీలించారు. అయితే కాస్త ఆలస్యం కావడంతో బాలకృష్ణ రోడ్డు మార్గం కుండా తిరిగి హైదరాబాద్ చేరుకున్నట్టు తెలుస్తుంది.
ఇలా పైలెట్ ముందు చూపుతోనే సాంకేతిక లోపాన్ని ముందుగా గ్రహించడంతో ఎమర్జెన్సీ లాండింగ్ చేశారు. లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేదని ఈ ప్రమాదం నుంచి బాలకృష్ణ బయటపడ్డారని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.ఇక శృతిహాసన్ నటించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీ విడుదలకు సిద్ధమైంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…