Movie News

Ramya Raghupathi: నరేష్ కు నేను విడాకులు ఇవ్వను… నరేష్ పవిత్రల పెళ్లి జరగనివ్వను… రమ్య రఘుపతి షాకింగ్ కామెంట్స్!

Ramya Raghupathi: నరేష్ పవిత్రల వ్యవహారం రోజురోజుకు పెద్ద ఎత్తున వివాదంగా మారుతుంది.వీరిద్దరూ కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాము అంటూ ఒకరికొకరు కేక్ తినిపించుకొని లిప్ లాక్ పెట్టుకున్నటువంటి వీడియోని షేర్ చేస్తూ వీరి మధ్య ఉన్నటువంటి బంధాన్ని అధికారకంగా ప్రకటించారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో పై ఎంతో మంది స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేశారు. అలాగే ఈ వీడియో పై నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి కూడా స్పందించారు.ఈ సందర్భంగా రమ్య రఘుపతి మాట్లాడుతూ నరేష్ పవిత్రల వివాహం జరగనివ్వనని ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పుకొచ్చారు. తాను నరేష్ కు విడాకులు ఇవ్వకపోతే నరేష్ పవిత్రని ఎలా పెళ్లి చేసుకుంటారని ఈమె ప్రశ్నించారు.

నా కుమారుడు తన తండ్రికి విడాకులు ఇవ్వద్దని తన దగ్గర నుంచి ఒట్టు తీసుకున్నారని రమ్య తెలియజేశారు. నరేష్ కు విడాకులు ఇవ్వకపోతే నరేష్ పవిత్రను పెళ్లి చేసుకుని అవకాశం ఉండదు. అయితే వీరికి పెళ్లి చేసుకుని అవకాశం లేకపోతే ఇద్దరూ సహజీవనం చేయాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం వీరిద్దరు కూడా చేస్తున్నది అదేనని అర్థమవుతుంది.

Ramya Raghupathi: సినిమా ప్రమోషన్ లో భాగంగానే వీడియో షేర్ చేశారా…

ఇక వీరిద్దరూ షేర్ చేసిన వీడియోపై రమ్య పలు ఇంటర్వ్యూలలో హాజరవుతూ నరేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు కానీ రమ్య చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై నరేష్ ఇప్పటివరకు ఏ విధంగా స్పందించలేదు.మరి నరేష్ త్వరలోనే తమ పెళ్లి తేదీని ప్రకటిస్తారని అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో మరొక వార్త వైరల్ గా మారింది. నరేష్ పవిత్ర షేర్ చేసినటువంటి ఈ వీడియో ఓ సినిమా ప్రమోషన్ లో భాగమేననే వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago