బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలే గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఇప్పటికే టాప్ 5లో ఉన్న సిరి, మానస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇక విన్నర్ రేసులో కేవలం ముగ్గురు మాత్రమే మిగిలిపోయారు. అందులో కూడా శ్రీరామచంద్ర రూ.25లక్షలు తీసుకొని.. ఇంటి బటయకు వచ్చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇందులో ఎంత నిజముందో తెలవాలంటే.. ఆదివారం సాయంత్ర 6 గంటల నుంచి దాదాపు 4గంటల పాటుగా టెలికాస్ట్ కాబోతున్న ఈ ఫినాలే చూడాల్సిందే. ఇక ఇందులో సెలబ్రిటీలు చేసిన హంగామాతో స్టేజ్ దద్దరిల్లిపోయింది. బిగ్ బాస్ సీజన్ 5లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ డ్యాన్స్ పెర్ఫామన్స్ తో స్టేజ్ పైకి వచ్చారు.
ఇక ఒక్కొక్కరిగా సాగిన ఎలిమినేషన్ ఉత్కంఠని రేకెత్తిచ్చింది. ముందుగా సుకుమార్ ఇంకా దేవిశ్రీ ప్రసాద్ ఇద్దరూ బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి హౌస్ మేట్స్ కి ఆల్ ద బెస్ట్ చెప్పారు. దేవీ శ్రీ ప్రసాద్ మరియు నేషనల్ క్రష్ రష్మికా హౌస్ లోకి వెళ్లి.. పుష్ప సినిమా నుంచి ‘రా రా స్వామి’ అనే పాటకు డ్యాన్స్ కూడా వేసేశారు. ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమోలో అలియా భట్.. రణవీర్ కపూర్ బిగ్ బాస్ వేదికపై కనిపించారు.
హౌస్ లో ఉన్న సభ్యులతో వాళ్లు మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా సన్నీ.. అలియా… అంటూ అరిచాడు. దీంతో అలియా భట్.. అతడిని చూస్తూ.. ‘సన్నీ.. ఐ లవ్ యూ’ అంటూ చెప్పింది. దీతో సన్నీ అక్కడికక్కడే పడిపోయాడు. దీంతో ఈ వీడియో ప్రోమో వైరల్ గా మారింది. అలియా భట్ అంత మాట అనే సరికి సన్నీకి నోటి నుంచి మాట రానట్టుంది. సిరిని ఆలియా భట్ అంటేనే ఫీల్ అయి అలా పిలవద్దు అంటూ చెప్పింది.. ఇప్పుడు డైరెక్ట్ గా అలియాతోనే ‘సన్నీ ఐ లవ్ యు’ చెప్పించు కున్నాడు అంటూ నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…