ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించే వారిలో సినీ నటులు, క్రిడాకారులే ఎక్కువగా ఉంటారు. సినిమాల్లో నటించే వారికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, గ్లామర్ ఉండటంతో తమ ఉత్పత్తులు వేగంగా జనాలకు వెళ్లుతాయని కంపెనీల అభిప్రాయం. ఇటు సినిమాలతో కోట్లు సంపాదిస్తూనే… యాడ్స్ ద్వారా మరింత సంపాదిస్తున్నారు.
గతంలో హీరోయిన్లు ఎక్కవగా బ్యూటీ ప్రోడక్ట్ లు, షాపింగ్ మాల్స్, జ్యూవలరీ ఐటెంలకు మాత్రమే యాడ్స్ ఇచ్చేవారు. ప్రస్తుతం కాలం మారింది. కాలంలో పాటు హీరోయిన్లు మారుతున్నారు. యాడ్స్ తీరు మారింది. గతంలో రకుల్ ప్రీతిసింగ్, పూజా హెగ్డే, రెజీనా కసాండ్రా వంటి గ్లామర్ డాల్స్ ఏకంగా మద్యం బాటిళ్లను మందు పెట్టుకుని వాటి ప్రమోషన్లలో పాల్గొన్నారు.
ఈ యాడ్స్ పై ప్రజల్లో ఎక్కువగా విమర్శల పాలయ్యారు ఈ భామలు. ఇలాంటి యాడ్స్ ఇచ్చి సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారంటూ విమర్శించారు ప్రజలు. మరోసారి ఇలాంటి యాడ్ లోనే నటిస్తోంది టాలీవుడ్ చందమామ కాజల్. భర్తతో కలిసి ఓ మద్యం బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఆ మందును ప్రమోట్ చేస్తోంది. ఈ క్రమంలోనే తన భర్తతో మందు బాటిల్ ముందు పెట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేసింది.
అయితే ఈ ఫోటోను షేర్ చేస్తూ.. మన పార్ట్న ర్స్ సాయంత్రం ఇలా పెగ్గు కలుపుతూ మన పక్కనే ఉంటే వీకెండ్ అలా గడిచి పోతుంది కదా అని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. అయితే ఈ మద్యం కేవలం 25 ఏళ్లు నిండినవారే తాగాలని చెప్పుకుంటు వచ్చింది కాజల్ అగర్వాల్. ప్రస్తుతం కాజల్ పెట్టిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ ఫోటోను చూసిన నెటిజెన్లు ఆగ్రహానికి గురవుతున్నారు. సినిమాల్లో సంపాదించి చాలదా…? ఇప్పుడు ఇలాంటి వాటిని ప్రమోట్ చేసి యువతను పక్కదారి పట్టిస్తున్నావా..అంటూ కామెంట్లు చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…