సాయిపల్లవి నటనతో పాటు తన డ్యాన్సింగ్ తో అభిమానులను సంపాదించుకుంది. ముఖ్యంగా తన వ్యక్తిత్వంతో చాలా మందిని ఆకట్టుకుంది. ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా కొన్ని యాడ్స్ లో నటించలేదు. తాజాగా నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్న సెబాస్టియన్ ముఖ్య పాత్రధారులుగా రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా శ్యాంసింగరాయ్.
ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచానాలు నెలకొన్నాయి. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది శ్యాంసింగరాయ్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. తాజాగా హైదరాబాద్ లో శ్యాంసింగరయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు చిత్ర యూనిట్.
అయితే ఈ కార్యక్రమంలో సాయి పల్లవి మాట్లాడుతూ.. కంటతడి పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. సినిమా గురించి, డైరెక్టర్ రాహుల్ గురించి సాయిపల్లవి మాట్లాడుతున్న సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున అరిచారు. దీంతో అభిమానులు ప్రేమను తట్టుకోలేని సాయిపల్లవి ఎమోషన్ అవుతూ.. స్టేజ్ పై ఏడ్చేసింది.
సాధారణంగా హీరోలు మాట్లాడుతున్నప్పడు మాత్రమే అభిమానంతో అరిచే అభిమానులను చూస్తుంటాం. అయితే ఒక హీరోయిన్ మాట్లాడే సమయంలో ఫ్యాన్స్ ఇంతలా రచ్చ చేయడం చాలా అరుదని అంటున్నారు. దీన్ని బట్టి తెలుస్తోంది తెలుగులో సాయిపల్లవి క్రేజ్. ఈ సినిమాలో సాయిపల్లవిల్ల దేవదాసిగా కనిపించనుంది. క్రిస్మ స్ కానుకగా డిసెంబరు 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…