Actor Bharath Reddy : డాక్టర్ కావాల్సిన వాడు యాక్టర్ అయ్యాడు అంటూ కొంతమందిని అంటూ ఉంటాం కానీ ఈ వ్యక్తి మాత్రం డాక్టర్ అయి ఆ తరువాత యాక్టర్ అయ్యాడు. అటు డాక్టర్ గా సేవాలాందిస్తూనే మరోవైపు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. అతను మరెవరో కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ భరత్ రెడ్డి. చాలా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తూ ఉండే భరత్ రెడ్డి నిజానికి డాక్టర్ అని చాలా మందికి తెలియదు. వెంకటేష్ గారి సినిమా ‘ఈనాడు’ సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న భరత్ రెడ్డి ఆ తరువాత చాలా సినిమాల్లో నటించారు. గుండె నిపుణుడిగా పనిచేస్తూనే సినిమాల్లో నటిస్తున్న భరత్ రెడ్డి గారు ముందుతరాల వాళ్ళకు ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు కలుగుతాయి, మన అహార అలవాట్లు ఎలా మారిపోతున్నాయి అన్న విషయాల గురించి మాట్లాడారు.
పదేళ్లలో డైబేటీస్ డయాబెటీస్ పెరుగుతుంది…
ప్రస్తుతం వైద్యుడిగా ఉంటూనే సినిమాల్లోను నటిస్తున్న భరత్ రెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని ఎలా చూసుకోవాలి అనే విషయాన్ని తెలిపారు. అనారోగ్యంతో వారి వద్దకు వచ్చే పేషేంట్స్ దాదాపు చిన్న వయసు ఉన్నవారే ఉంటున్నారు అంటూ ఆహారపు అలవాట్లు చేటు చేస్తున్నాయి అంటూ చెప్పారు. ఒకప్పుడు 50 ఏళ్లకు పైబడిన వారిలో గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చేవని ఇప్పుడు 35 తరువాత ఎంతో మంది గుండెకు సంబంధించిన అనారోగ్యాలతో హాస్పిటల్స్ కి వస్తున్నారంటూ తెలిపారు. ఇక ఆహారంలో బియ్యంకు సంబంధించిన ఆహారం బదులు తృణ ధాన్యాలను ఎక్కువగా తీసుకుంటే మంచిదని, 2023 సంవత్సరం ను యూఎన్ఒ కూడా మిల్లెట్స్ ఇయర్ గా ప్రకటించిందని, ప్రపంచం మొత్తం ఇప్పుడు తృణ ధాన్యాల అవశ్యకత గురించి తెలుసుకుంటున్నారు.
కానీ మనం ఇంకా బియ్యం మీదే ఆధారపడుతున్నాము అంటూ తెలిపారు. అందుకే తృణ ధాన్యాలను ఎలా తీసుకోవాలో అవగాహన కల్పిస్తున్నామంటూ తెలియపారు. సిక్స్ ప్యాక్ కాన్సెప్ట్ తో రోజు ఒక మిల్లెట్ అంటే ఒక రోజు బార్లీ, ఒకరోజు కొర్రలు, ఒకరోజు సజ్జలు ఇలా ఆరు రోజులకు ప్రణాళిక వేసుకుని తినాలి అంటూ నేను నా వద్దకు వచ్చే పేషెంట్స్ కి టాబ్లెట్ బదులుగా మిల్లెట్స్ తో ఉదయం అల్పాహారం తీసుకోండి, ఆసిడీటీ కూడా ఉండదు అని సూచిస్తానని తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…