Ram Gopal Varma : తెలుగు సినిమాకు కొత్త ట్రెండ్ ను తెచ్చిన ట్రెండ్ సెట్టర్ వర్మ. ‘శివ’ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ సినిమా తీరును మార్చేశాడు. స్టడీ కెమెరాను వాడి సినిమా విజువల్స్ కి కొత్తదనం తీసుకోచ్చి అలానే సినిమా పంథాను మార్చి అందరినీ ఆకర్శించాడు వర్మ. వివాదాలతో బతికే వర్మ లో ఒక మంచి టెక్నీషియన్ ఉన్నాడు. ఇది ఎవరు కాదనలేని సత్యం. తాను తీసిన పాత సినిమాలను చూస్తే ఎవరైనా ఆర్జీవి ఫ్యాన్ అవ్వాల్సిందే. తాజాగా శివ సినిమా గురించి విశేషాలను వర్మ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అసలు తాను డైరెక్టర్ అవ్వాలని ఎందుకు అనుకున్నాడు ఎలా అక్కినేని కాంపౌండ్ లోకి వెళ్ళాడు అనే విషయాలను తెలిపారు.
నాది ప్రేమ వివాహం.. 800కి పనిచేసా.. శివ ఎలా మొదలయింది…
రామ్ గోపాల్ వర్మ బి టెక్ చదివే సమయంలో స్నేహితులకు చూసిన సినిమాల కథలు చెప్పడం, వాళ్ళు వర్మ చెప్పిన స్టోరీ కి ఇంప్రెస్స్ అయ్యి సినిమా చూసి సినిమా అలా లేదు నువ్వు వేరే చెప్పావ్ అని, నువ్వు చెప్పిన స్టోరీ బాగుంది అంటూ ఒక స్నేహితుడు నాకు డబ్బు ఉంటే వర్మని పెట్టి సినిమా తీస్తా అనడంతో అక్కడ వర్మ కు సినిమా తీయాలనే ఆలోచన మొదలయిందట. ఇక చదువుయ్యాక వర్మ గారి తాతగారు హోటల్ తాజ్ లో ఉద్యోగం ఇప్పించగా నెలకు 800 వందలకు వర్మ పనిచేసారట. శాలరీ పెరుగుతుందని నైజీరియా వెళ్లి పనిచేసినా ఆయన తిరిగి సినిమా మీద పిచ్చితో ఇండియా వచ్చేసారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వర్మ హైదరాబాద్ వచ్చి రామోజీ రావు, సురేష్ బాబు వంటి వారిని కలిసి సినిమా తీయాలనుకుంటున్నాను అని చెబితే వారు ప్రాక్టికల్ గా వర్క్ ఔట్ కాదు ముందు ఎక్స్పీరియన్స్ తెచ్చుకోమన్నారట.
ఇక ఒకరోజున వీడియో లైబ్రరీ వద్దకు వెళ్ళవలసి రావడం అలా వీడియో లైబ్రరీ పెట్టాలనే ఆలోచనతో తండ్రి వద్దకు వెళితే అప్పటికే ఉద్యోగం వదిలి కులాంతర వివాహం చేసుకున్న వర్మ మీద సదాభిప్రాయం లేకపోయినా అన్నపూర్ణ స్టూడియోస్ లో పనిచేస్తున్న ఆయన రిటైర్ అవుతున్న సమయంలో వర్మ కు షాప్ పెట్టుకోడానికి ఇఅనుమతి ఇచ్చారట. తెలిసిన వ్యక్తి వర్మ గారి తండ్రికి ఒక షాప్ ఇవ్వడంతో ఆ షాప్ లో జ్యూస్ పార్లల్ పెట్టాలనుకుంటే వర్మ అడిగాడని వీడియో లైబ్రరీ పెట్టుకోడానికి ఇచ్చారట. ఇక ఫ్రెండ్స్ తో అప్పులు చేసి వీడియో లైబ్రరీ పెట్టిన వర్మ గారు అనతి కాలంలోనే నెలకు 25000 వరకు సంపాదించేవారట. ఇక ఆ సమయంలోనే సినిమా వాళ్ళు షాప్ కి ఎక్కువగా రావడం, వారితో పరిచయాలు పెంచుకోవడం అన్నపూర్ణ కాంపౌండ్ నుండి సురేంద్ర, అక్కినేని వెంకట్ తో పరిచయాలు ఏర్పడి అన్నపూర్ణ కాంపౌండ్ లోకి అడుగు పెట్టి శివ సినిమా కథ చెప్పి ఒప్పించి తీశారు వర్మ.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…