Movie News

Actor Chandra Mohan: శోభన్ బాబు చెప్పినా వినలేదు.. 100 కోట్ల ఆస్తి నష్టపోయాను: చంద్రమోహన్

Actor Chandra Mohan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా సుమారు 1000 సినిమాలకు పైగా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటుడు చంద్రమోహన్ గురించి పరిచయం అవసరం లేదు. ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో తండ్రి పాత్రలలో కూడా నటించి సందడి చేశారు. ప్రస్తుతం వయసు పై పడటంతో ఈయన సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి చంద్రమోహన్ మొదటిసారి తన గురించి తన ఫ్యామిలీ గురించి పలు విషయాలను చెప్పుకొచ్చారు.ఇకపోతే ఈ ఇంటర్వ్యూలో భాగంగా చంద్రమోహన్ భార్య జలంధర మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా జరంధరం మాట్లాడుతూ చంద్రమోహన్ గారి చేతి నుంచి ఒక రూపాయి ఎవరైనా అందుకున్న వారికి బాగా కలిసి వస్తుందని చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే ప్రతి ఏడాది జనవరి ఒకటవ తేదీ ఎంతోమంది ఈయనతో కనీసం ఒక్క రూపాయి అయినా ఇప్పించుకోవడం కోసం పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తారు అంటూ చెప్పుకొచ్చారు.చంద్రమోహన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినిమా ఇండస్ట్రీలో సంపాదించిన దానికన్నా పోగొట్టుకున్నదే ఎక్కువగా ఉందని సుమారు 100 కోట్లకు పైగా ఆస్తులను పోగొట్టుకున్నానని తెలిపారు.

Actor Chandra Mohan: ఆస్తులన్నీ అమ్ముకున్నాను…


గొల్లపూడి మారుతీరావు కొంపల్లి వద్ద ద్రాక్ష తోట కొన్నారు. నన్ను కొనమని చెబితే నేను కూడా 35 ఎకరాల పొలం కొన్నారు. అయితే ఆ పొలం మెయింటెన్సెస్ చేసే స్తోమత లేకపోవడంతో అమ్మాలని నిర్ణయించుకున్నాను. అలాగే మద్రాసులో ఉన్నటువంటి 15 ఎకరాలను అమ్మాను. శంషాబాద్ దగ్గర రోడ్డుకు ఉన్నటువంటి ఆరు ఎకరాల భూమిని కూడా ఆమ్మాను.అయితే నేను ఆస్తులు అమ్ముతున్న సమయంలో శోభన్ బాబు ఇలా అమ్మవద్దు అని ఎంత చెప్పినా వినకుండా నేను అప్పట్లోనే ఇంత ఆస్తిని అమ్మానని అయితే ప్రస్తుతం ఈ ఆస్తులు విలువ సుమారు 100 కోట్లకు పైగా ఉంటుందని, తాను 100 కోట్ల రూపాయల ఆస్తిని పోగొట్టుకున్నానంటూ ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago