Actor Harinath: ఈ ఏడాది ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు అలాగే వారి కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు. ఇలా ఈ ఏడాది ఎంతోమంది సెలబ్రిటీలను ఇండస్ట్రీ కోల్పోయిందని చెప్పాలి. ఈ క్రమంలోనే సీనియర్ నటుడు హరినాథ్ ఇంట్లో కూడా విషాద ఘటన చోటుచేసుకుంది.
సీనియర్ నటుడు హరినాథ్ కుమార్తె, నిర్మాత జి వి జి రాజు భార్య అయినటువంటి పద్మజ రాజు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. ప్రస్తుతం ఈమె వయసు 54 సంవత్సరాలు ఈమెకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. పద్మజ ప్రముఖ నటుడు కుమార్తె మాత్రమే కాకుండా నిర్మాతకు భార్య కూడా.
ఈమె భర్త జివిజి రాజు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గోకులంలో సీత తొలిప్రేమ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక తన భర్త రాజు నిర్మించే సినిమాలకు ఈమె సమర్పకు రాలిగా కూడా పనిచేశారు. ఇకపోతే ఈమె తన తండ్రి హరినాథ్ గురించి అందాల నటుడు అనే పేరిట ఒక పుస్తకం రచించారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ దివంగత నటుడు కృష్ణ గారి చేతుల మీద ఆవిష్కరించారు.
ఈ పుస్తకావిష్కరణ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి పద్మారాజు త్వరలోనే తన కుమారులలో ఒకరిని ఇండస్ట్రీకి నిర్మాతగా పరిచయం చేయబోతున్నానని అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని వచ్చే ఏడాది తన కుమారుడు నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని తెలియజేశారు. అయితే తన కుమారుడిని నిర్మాతగా కూడా చూడకుండా ఈమె మరణించడంతో ఈమె ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…