Movie News

Actor Hrithik Roshan: బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కార్ల కలెక్షన్ వాటి విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Actor Hrithik Roshan: బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు హృతిక్ రోషన్ ఒకరు. అమ్మాయిల కలల రాకుమారుడుగా ఉన్నటువంటి హృతిక్ రోషన్ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవడం కోసం ఏదో కష్టపడుతూ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా పేరు ప్రఖ్యాతలు పొందారు.ఇలా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హీరోల గురించి అభిమానులు తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చెబుతారు. ముఖ్యంగా వాళ్ళు ఉపయోగించే కార్లు వాళ్ళు ఉపయోగించే బ్రాండెడ్ వస్తువుల గురించి తెలుసుకోవడానికి ఇష్టత చూపుతారు.

ఈ క్రమంలోనే హృతిక్ రోషన్ కార్లు ఏవి ఆ కార్లు ఖరీదు ఎంత అనే విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు ఎంత ఉత్సాహం కనబరుస్తున్నారు. మరి హృతిక్ రోషన్ కార్ల కలెక్షన్ గురించి ఓ లుక్ వేసేద్దాం. ప్రపంచం లోనే అత్యంత విలాసవంతమైన, ఖరీదైన కార్లలో రోల్స్ రాయిస్ ఒకటి. హృతిక్ రోషన్ తన 42వ పుట్టినరోజు సందర్భంగా ఈయన రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ II కారును కొనుగోలు చేశారు.ఈ కారు ఖరీదు సుమారు ఏడు కోట్ల వరకు ఖరీదు చేస్తుందని సమాచారం.

రోల్స్ రాయిస్ కారుతో పాటు మెర్సిడెస్ బెంజ్ కారు కూడా ఈయన వద్ద ఉంది. మేబాచ్ S600 లగ్జరీ కారును హృతిక్ కొనుగోలు చేశారు. ఈ కారు ఖరీదు సుమారు 2.25 కోట్ల రూపాయలు ఖరీదు చేస్తుందని సమాచారం. హృతిక్ తరచూ ఉపయోగించే కార్లలో మినీ కూపర్ కన్వర్టిబుల్ ఒకటి. హృతిక్ గ్యారేజ్ లో ఫెరారీ 360 మోడెనా కారు కూడా ఒకటి ఈ కారు మార్కెట్లోకి వచ్చిన తర్వాత మొదట కొన్నది సచిన్ కాగా రెండో కారు కొన్న వ్యక్తి హృతిక్ కావడం విశేషం. ఈ కారు కూడా సుమారు 80 లక్షల విలువ చేస్తుంది.

Actor Hrithik Roshan: కోట్లు విలువ చేసే కార్లను ఉపయోగిస్తున్న హృతిక్…

ఈయన ఉపయోగించే వాటిలో ఫోర్డ్ ముస్టాంగ్ ఇది 1966 కాలం నాటి అత్యంత అరుదైన కారు. ఈ కారు ధర సుమారు రెండు కోట్ల వరకు ఉంటుందని అంచనా వీటితో పాటు ఆస్టన్ మార్టిస్ రాపిడ్ ఎస్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్, ఆడి లాంటి మరెన్నో ఖరీదైన కార్లు హృతిక్ గ్యారేజ్ లో ఉన్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago