Ramki: నటుడు రామ్ కీ అంటే టక్కున ఈయన అందరికీ గుర్తుకు రాకపోవచ్చు కానీ ఆర్ఎక్స్ 100 సినిమాలో డాడీ పాత్రలో నటించిన నటుడు అంటే మాత్రం అందరికీ ఈయన టక్కున గుర్తుకు వస్తారు. ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరో హీరోయిన్ల తర్వాత అంత అద్భుతంగా ఏ పాత్ర అయినా ఉంది అంటే అది రామ్ కీ నటించిన డాడీ పాత్ర అని చెప్పాలి. ఈ సినిమాలో ఈయన పెళ్లి చేసుకొని ఉండరు కానీ అందరికీ తలలో నాలుక లాగా ఉండడంతో అందరూ తనని డాడీ అని పిలుస్తూ ఉంటారు.
ఇలా ఈ సినిమాలో నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన ఇదివరకు తెలుగులో పలు సినిమాలలో నటించారు. అలాగే తమిళ భాషల్లో కూడా పలు చిత్రాలలో నటించి నటుడుగా గుర్తింపు పొందారు. అయితే ఈయన ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇదిలా ఉండగా ఈయన భార్య కుమార్తె కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ అనే విషయం చాలామందికి తెలియదు.
మరి నటుడు రామ్ కీ భార్య కూతురు ఎవరు అనే విషయానికి వస్తే తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా తమిళంలో కూడా నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన వారిలో నటి నిరోష ఒకరు . ఈమె తెలుగులో కంటే తమిళంలోనే వంద సినిమాలకు పైగా నటించి ప్రేక్షకులను మెప్పించారు.
నిరోష..
ఇలా నిరోష స్వయంగా రామ్ కీ భర్త అనే విషయం చాలామందికి తెలియదు అంతేకాకుండా ఈయన అన్నయ్య కూడా ఇండస్ట్రీలో ఒక స్టార్ నటుడే. ఆయన మరెవరో కాదు నటుడు శరత్ కుమార్ ఆలెక్కన రాధిక శరత్ కుమార్ కూడా ఈయనకు అన్నయ్య వదినలు అవుతారు అలాగే శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఈయనకు వరసకు కూతురు అవుతారు. ఈ విధంగా నటుడు రామ్ కీ భార్య అన్నయ్య కుమార్తె అంతా కూడా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలు అనే విషయం తెలియడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…