Actor Jogi Naidu : అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ మొదలు పెట్టిన జోగి నాయుడు గారు జెమినీ టీవీలో వస్తున్న జోగి బ్రదర్స్ కార్యక్రమం ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. ఇక అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు డైరెక్టర్స్ తో పనిచేస్తూనే మరోవైపు సినిమాల్లో కమెడియన్ గా కూడా చేసారు. ఇక జెమినీ టీవీలో పనిచేస్తున్న సమయంలోనే యాంకర్ ఝాన్సీ గారితో పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకున్నారు. ఇక జోగి నాయుడు గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన వ్యక్తిగత జీవితం అలగే ఇప్పటి రాజకీయాల గురించి పంచుకున్నారు.
జగన్ చాలా పాజిటివ్ మనిషి…
జోగి నాయుడు గారు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏపీ సీఎం జగన్ ఏం చేసారు అనే విషయాల గురించి మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీకి ప్రస్తుతం పెద్ధ సమస్యలు లేవని, పాన్ ఇండియా లెవెల్ కి సినిమా ఇండస్ట్రీ వెళ్లిందని ఇక సమస్యలు అంటే చిన్న ఆర్టిస్టులు అలాగే లైట్ మెన్స్ లాంటి వాళ్లకే కానీ మిగిలిన ఇండస్ట్రీ బాగానే ఉంది. ఇక ఇండస్ట్రీని జగన్ పట్టించుకోలేదనే సో కాల్డ్ పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒకసారి వాళ్ళు ఇండస్ట్రీ అభివృద్ధికి ఏం చేసారో చెప్పాలి. వైజాగ్ కి ఇండస్ట్రీ రావాలని స్టూడియోలు కట్టాలని జగన్ గారు చెబుతూనే ఉన్నా ఏం చేసారు. వైజాగ్ కి ఎందుకు ఇండస్ట్రీ తరలించలేదు.
ఇక హైదరాబాద్ లో హ్యాపీగానే ఉన్నాం ఇండస్ట్రీని కెసిఆర్ పట్టించుకుంటున్నారని ఈ పెద్దలే చెబుతున్నారు మరి ఇక జగన్ గారు ఏం పట్టించుకోవాలి. ఆయన వద్దకు వచ్చి సమస్య ఇది అని మాట్లాడితే చాలా పాజిటివ్ గా స్పందించి ఆయన చర్యలు తీసుకుంటారు. మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పు అంటూ చెప్పారు జోగి నాయుడు. ప్రస్తుతం జోగి నాయుడు గారు ఏపీ భాషా సంస్కృతిక శాఖకి క్రియేటివ్ హెడ్ గా నియమితులయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…