Actor Krishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు. ఈయన నేడు తెల్లవారుజామున నాలుగు గంటలకు కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో కాంటినెంటల్ హాస్పిటల్ కు చేరిన కృష్ణ వెంటిలేటర్ చికిత్స తీసుకుంటూ నేడు తెల్లవారుజామున మృతి చెందారు.
ఈ విధంగా కృష్ణ మరణించడంతో ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు కృష్ణ నివాసానికి చేరుకొని ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.ఇకపోతే కృష్ణ మరణించిన తర్వాత ఆయన గురించి ఎన్నో విషయాలు ఎంతోమంది గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కృష్ణ గారు మరణించడంతో ఆయన చివరి 4 కోరికలు తీరకుండానే మరణించారని వార్తలు వస్తున్నాయి.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లూరి సీతారామరాజు వట్టి అద్భుతమైన పాత్రలో నటించి ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసినటువంటి కృష్ణ అలాంటి తరహా పాత్రలో నటించాలని భావించారట. ఈ క్రమంలోనే చత్రపతి శివాజీ పాత్రలో నటించాలని ఆశపడ్డారు. అయితే ఇలాంటి సినిమాలలో నటిస్తే మతపరమైన వివాదాలు తలెత్తుతాయని ఈ పాత్రలో నటించకుండా ఉండిపోయారు.
ఇక తన కుమారుడు మహేష్ బాబుని జేమ్స్ బాండ్ లాంటి పాత్రలో చూడాలన్నది కృష్ణ గారి కోరికట. అయితే మహేష్ బాబు తన తండ్రి చేసిన సినిమాలను రీమేక్ చేయడానికి పూర్తిగా వ్యతిరేకత చూపించడంతో మహేష్ బాబును జేమ్స్ బాండ్ పాత్రలో చూడలేక ఆ కోరిక కూడా అలాగే మిగిలిపోయిందట.ఇక బాలీవుడ్ నటుడు అమితాబ్ నిర్వహిస్తున్నటువంటి కౌన్ బనేగా కరోడ్ పతి వంటి ఓ కార్యక్రమాన్ని చేయాలని కోరికగా ఉండేదట ఈ కోరిక కూడా నెరవేరకుండా పోయింది.ఇకపోతే తన కుమారులు మహేష్ బాబు రమేష్ బాబుతో కలిసి నటించిన కృష్ణకు తన మనవడితో కలిసి నటించాలని కోరికగా ఉండేది కథ కుదిరితే తప్పకుండా చేయాలని ఆశపడ్డారట. అయితే ఈ కోరికలు తీరకుండానే సూపర్ స్టార్ కృష్ణ గారు కన్నుమూశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…