మెగాస్టార్ చిరంజీవికి చిత్ర పరిశ్రమలో ఏ విధమైనటువంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మెగాస్టార్ ప్రస్తుతం ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారు.ఈ విధంగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన చిరంజీవి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మెగా స్టార్ అనే పేరు సంపాదించుకున్నారు.ఈ విధంగా ఎన్నో సినిమాలలో నటిస్తూ కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ ఆ తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
ఇలా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుత హీరోలకు పోటీగా వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మెగాస్టార్ “ఆచార్య” సినిమాలో నటిస్తుండగా ఆ తర్వాత “గాడ్ ఫాదర్”, “భోళాశంకర్” వంటి సినిమాలలో కూడా నటిస్తున్నారు.ఇదిలా ఉండగా ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
మెగాస్టార్ పుట్టినరోజుకి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే చిరంజీవి తాజాగా తన చిరకాల మిత్రుడు, భారత దేశానికి మొట్టమొదటి సారిగా ప్రపంచ కప్ అందించిన క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ను కలుసుకున్నారు. ఈ సమావేశంలో చిరుతో పాటు ఆయన సతీమణి సురేఖ కూడా పాల్గొన్నారు. ఎన్నో రోజుల తర్వాత కలుసుకున్న వీరిద్దరూ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎంతో సరదాగా గడిపారు.
ఫలుక్ నామా ప్యాలెస్లో జరిగిన ఓ సమావేశంలో కపిల్ దేవ్ ను చిరు సతీసమేతంగా. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి ఇన్స్టాలో షేర్ చేస్తూ చాలా కాలం తర్వాత నా మిత్రుడిని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ ఈ క్రమంలోనే గతంలోకి వెళ్లి ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నామని ఇండియాకు ప్రపంచకప్ అందించిన హర్యానా హర్రీక్రేన్ అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…