బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అన్ని టీవీ చానల్స్ లో వివిధ కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.
కేవలం యాంకర్ గా మాత్రమే కాకుండా ఆడియో ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ లు, ఇంటర్వ్యూల వరకు ఇలా ప్రతి చోట సుమ సందడి కనిపిస్తూనే ఉంటుంది. కేవలం యాంకరింగ్ మాత్రమే కాకుండా పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ వాటిని ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియా వేదికగా తన ప్రోగ్రామ్స్ గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
గత కొద్ది రోజుల క్రితం తనచెల్లి అంటూ తన మామయ్య కూతురును పరిచయం చేసిన సుమ తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.ఈ సమయంలోనే సుమ తన తల్లికి మేకప్ వేస్తున్న సమయంలో తీసిన వీడియోను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ త్వరలోనే పూర్తి వీడియోను చూడబోతున్నారు.. అంతవరకు వేచి ఉండండి అంటూ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.సుమ తన తల్లితో ఏదైనా కొత్త ప్రోగ్రాం మొదలు పెట్టబోతుందా..అని కొందరు కామెంట్ చేయగా మరికొందరు సుమ చేస్తున్నటువంటి వంటల ప్రోగ్రాంలో భాగంగా తన తల్లి ఈ షోలో పాల్గొనబోతున్నారా అంటూ.. పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ విషయం గురించి క్లారిటీ రావాలంటే సుమ చెప్పినట్టు కొన్నిరోజుల వరకు వేచి ఉండాల్సిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…