తెలుగు రాష్ట్రాల్లో నటుడు నాగభూషణం గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. సినిమాల్లో హీరోని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించే కన్నింగ్ విలన్ పాత్రలో నాగభూషణం అద్భుతంగా నటించేవాడు. ప్రేక్షకులు కూడా మెచ్చుకునే విలనిజానికి నాంది పలికిన ఏకైక ప్రతినాయకుడిగా నాగభూషణం నిలిచారు అంటే అతిశయోక్తి కాదు. ఇతడు రక్త కన్నీరు సినిమా లో రక్త కన్నీరు నాగభూషణం అనే పాత్రలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.
విలనిజానికి కూడా కామెడీ టచ్ ఇవ్వొచ్చని ఒక సరికొత్త ట్రెండ్ ని తెలుగు పరిశ్రమకి రుచి చూపించిన నాగభూషణం ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. సినిమాల్లో, నాటకాలలో ఏకకాలంలోనే బ్రహ్మాండమైన నటన ప్రతిభ చూపించి వావ్ అనిపించిన సమర్థవంతమైన నాగభూషణం జీవితం గురించి తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. మొత్తం కలిపి 395 పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నాగభూషణం ఎలా చనిపోయారో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
1922 మే 5 వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలోని కొండేపి మండలం, అనకర్లపుడి గ్రామంలో నాగభూషణం జన్మించాడు. సినిమాల్లో నాటకాల్లో ఎంతో కాలం పాటు నటించిన నాగభూషణం యొక్క ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించిపోయింది. దీంతో అతడు తన పుట్టినరోజు నాడే అనగా 1995 మే 5వ తేదీన మృత్యు ఒడికి చేరుకున్నాడు. అప్పట్లో నాగభూషణం పుట్టినరోజు నాడే చనిపోవడంతో చాలా మంది సినీ అభిమానులు, ప్రముఖులు విశేషంగా భావించారు. ఇకపోతే నాగభూషణానికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, ఆరుగురు మనవళ్లు మనవరాళ్లు పిల్లలు ఉండగా… వీరిలో ఎవరూ సినిమా పరిశ్రమలోకి రాలేరు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…