Featured

Venu Madhav : అలా చేయడంతో.. నన్ను ఎన్టీఆర్ వెనుక నుంచి ఒక తన్నుతన్నారు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు. : వేణుమాదవ్

Venu Madhav : అసెంబ్లీలో లైబ్రరీ అసిస్టెంటుగా పనిచేసేటప్పుడు ఖాళీ సమయాల్లో ఎదురుగా ఉన్న రవీంద్ర భారతికి వెళ్ళడం అలవాటైంది. ఒకసారి ఆకృతి సంస్థ వాళ్ళు మాటల రచయిత దివాకర్ బాబుకు సన్మానం చేస్తుంటే చూడ్డానికి వెళ్ళి, అందులో వేదికపైన ఒక చిన్న ప్రదర్శన ఇచ్చాడు. రవీంద్రభారతిలో వేణుమాధవ్ చేసిన కామెడీ స్కిట్ అతడి జీవితాన్నే మార్చేసింది. వేణుమాధవ్ ఆ కార్యక్రమంలో “గుల గుల గులాబ్ జామ్” అంటూ చెప్పిన డైలాగ్ ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిలకు చాలా బాగా నచ్చి, సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆయన మొదటి సినిమా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా వచ్చిన సంప్రదాయం అనే సినిమా.

అప్పటివరకు మిమిక్రీ ప్రోగ్రాంకు రూ. 1000 మాత్రమే తీసుకునే వేణుమాధవ్‌కు ఆ సినిమా కోసం రూ. 70వేలు పారితోషికంగా ఇచ్చారు. నటుడిగా వేణుమాధవ్ తొలి రెమ్యునరేషన్ అదే. ఆ సినిమా పూర్తయిన మూడు రోజులకే శ్రీకారం చిత్రంలో అవకాశం వచ్చింది. అలా వరుస అవకాశాలతో బిజీ అయిపోయాడు. తొలిప్రేమ సినిమాలో అమ్మాయిలపైన వేణుమాధవ్ చెప్పిన డైలాగు ఆయన్ను ప్రేక్షకులకు చేరువ చేసింది.దిల్ సినిమాలో వేణుమాధవ్ పోషించిన నితిన్ మావయ్య పాత్ర మంచి పేరు వచ్చింది. హంగామా సినిమాతో హీరోగా మారిన వేణుమాధవ్, ప్రేమాభిషేకం సినిమాను నిర్మించాడు. ఇంకా అతనికి పేరు తెచ్చిన సినిమాలు సై, ఛత్రపతి, మొదలైనవి. చివరిసారిగా రుద్రమదేవి, డాక్టర్ పరమానందయ్య, స్టూడెంట్స్ గ్యాంగ్ సినిమాలలో నటించాడు.

హంగామా, భూకైలాష్, ప్రేమాభిషేకం చిత్రాల్లో వేణు హీరోగా నటించారు… ఆ మధ్యకాలంలో కమెడియన్ వేణుమాధవ్ ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ.. 1993-94 మధ్యకాలంలో భువనగిరి టిడిపి పార్టీ సమావేశంలో వేణుమాధవ్ మిమిక్రీ ప్రదర్శన ఇచ్చారు. దానిని చూసినా నారా చంద్రబాబు నాయుడు ఆయనను ఎన్టీఆర్ కి పరిచయం చేయించారు. వేణుమాధవ్ ప్రవర్తన నచ్చడంతో ఎన్టీఆర్ మాదాపూర్ టిడిపి ఆఫీసులో “కాల్ రిసెప్షనిస్టు”గా ఆయనకు అవకాశం కల్పించారు. నెలకి అతి పెద్ద మొత్తంలో జీతం వస్తుందనుకున్న వేణుమాధవ్ 600 రూ.లు చేతులో పెట్టడంతో ఆవక్కయ్యారు. ఒకరోజు ఉదయం నాలుగు గంటలకు లేచిన ఎన్టీ రామారావు కాలకృత్యాలు ముగించుకుని ఉదయం 7గం.లకు ప్రెస్ మీట్ పెట్టాలని ఆదేశించారు. ఆయనకంటే ముందే లేచిన వేణుమాధవ్ ప్రెస్ రిపోర్టర్స్ కు ఫోన్ చేసి ఉదయాన్నే ఏడు గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

అన్నగారు బయటకు వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ క్యాన్సిల్ అని చెప్పడంతో అక్కడున్న రిపోర్టర్స్ అవాక్కయ్యారు. ఆ తరువాత రిపోర్టర్స్ వెళ్లిపోవడంతో.. ఈరోజు ఉదయం ఎవరు డ్యూటీలో ఉన్నారో ఒకసారి ఇలా రండి అని ఎన్టీఆర్ పిలిచారు. వెంటనే వేణుమాధవ్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి నిలుచున్నారు.. ఆరుబయట వేసిన లైట్ ఇంకా ఎందుకు వెలుగుతోందని.. అలా లైట్ వేసి ఉంటే కరెంట్ బిల్లు ఎంత వస్తుందో మీకు తెలుసా అంటూ.. వేణుమాధవ్ ను వెనుక నుంచి ఒక తన్నుతన్నారు.. అసలు తను చేసిన తప్పేంటో అని ఆలోచిస్తున్న క్రమంలో మళ్ళీ అన్నగారు పిలుస్తున్నారని అనడంతో.. వేణుమాధవ్ డైనింగ్ హాల్లోకి వెళ్ళగానే కూర్చుండి బ్రదర్ ఇంకెప్పుడూ అలా చేయకండి తినండి దోశ చాలా రుచిగా ఉందంటూ ఎన్టీఆర్, వేణుమాధవ్ కి దోష వేయడం జరిగిందని ఆనాటి స్మృతులను ఆ ఇంటర్వ్యూలో వేణుమాధవ్ గుర్తు చేసుకున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago