Aadi -Akhil: బుల్లితెరపై మల్లెమాలవారు ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాల నుంచి జబర్దస్త్, ఢీ వంటి కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే ఢీ కార్యక్రమం ద్వారా ఎంతోమంది డాన్సర్లుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
ప్రస్తుతం ఈ కార్యక్రమం 14 వ సీజన్ కొనసాగుతుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది, అఖిల్, నవ్యస్వామి, రవి కృష్ణ వంటి వారు పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇక హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమానికి దూరమైనప్పటికీ ఈయన ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.
ఇక ఢీకార్యక్రమంలో మెంటర్ గా ఉన్నటువంటి హైపర్ ఆది తన కామెడీ పంచ్ డైలాగులతో పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమం కోసం హైపర్ ఆది ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారనే విషయం గురించి హాట్ టాపిక్ గా మారింది.ఈ కార్యక్రమం కోసం హైపర్ ఆది ఒక కాల్ షీట్ కి ఏకంగా ఐదు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది.ఈయన జడ్జెస్ తో పాటుగా ఈ కార్యక్రమంలో రెమ్యూనరేషన్ అందుకోవడం విశేషం.
ఇకపోతే ఈ కార్యక్రమంలో బుల్లితెర నటుడిగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అఖిల్ సైతం మెంటర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.అఖిల్ ఈ కార్యక్రమంలో కొనసాగుతూ కొద్దిరోజులు బ్రేక్ ఇచ్చి అనంతరం బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు. సాధారణంగా ఒకసారి మల్లెమాల వారి కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిన తర్వాత వారిని తిరిగి తీసుకోరు. కానీ అఖిల్ మాత్రం ఈ కార్యక్రమం నుంచి వెళ్లి బిగ్ బాస్ లో పాల్గొని, తిరిగి ఢీ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్నప్పుడు అఖిల్ ఒక వారానికి సుమారు రెండున్నర లక్ష వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఒక్కో కాల్ షీట్ కి లక్షన్నర వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…