Categories: FeaturedMovie News

Ntr: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తారక్.. అతను పిలిచినా రాడు: చైతన్య కృష్ణ

Ntr: జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ ను నందమూరి ఫ్యామిలీ దూరం పెడుతూనే వస్తున్నారు. ఇలా నందమూరి కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ వారి వ్యక్తిగత విషయాలలో కానీ లేదంటే రాజకీయాల పరంగా ఎక్కడ కూడా స్పందించలేదు.

గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కూడా ఎన్టీఆర్ స్పందించలేదు అలాగే ఎన్నికల సమయంలో కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఈయన మాట్లాడకపోవడంతో కొంతమంది తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి సభ్యులను అభినందిస్తూ ఈయన ట్వీట్ చేసారు.

ఇక వీరికి అభినందనలు తెలుపుతూ కుటుంబ సభ్యుడిగా కాకుండా సినిమా ఇండస్ట్రీ తరఫున ఈయన ఒక నటుడుగా వారికి అభినందనలు తెలిపారని తెలుస్తోంది. అయితే చంద్రబాబుకి అభినందనలు తెలిపిన ఈయన ఆయన ప్రమాణ స్వీకారానికి వస్తారా రారా ఆహ్వానం అందిందా లేదా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

నందమూరి కుటుంబానికి దూరంగా ఉన్నారు…
ఈ క్రమంలోనే చైతన్య కృష్ణ ఈ విషయంపై మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కుటుంబం అంటే సంతోషాలలో మాత్రమే కాదు బాధలలో కూడా ఒకటవ్వాలని ఈయన తెలిపారు. ఇక ఎన్టీఆర్ మామయ్య ప్రమాణ స్వీకారానికి వస్తారో రారో తెలియదు ఇటీవల కాలంలో ఆయన నందమూరి కుటుంబానికి అలాగే కుటుంబ శుభకార్యాలకు దూరంగా ఉంటున్నారు ఒకవేళ పిలిచిన అతను రాడు అంటూ నందమూరి కుటుంబ చైతన్యకృష్ణ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago