Actor Nani: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ప్రతి ఒక్క విషయాన్ని భూతద్దంలో పెట్టుకొని చూస్తూ అందులో చిన్న తప్పు దొరికిన పెద్ద ఎత్తున కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంటారు. ఇలా సెలబ్రిటీలు సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత మాట్లాడే ప్రతి ఒక్క మాట ఒకటికి పది సార్లు ఆలోచించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయి.పొరపాటున ఎవరైనా మాట్లాడకూడని మాట మాట్లాడితే పెద్ద ఎత్తున నేటిజన్ల ట్రోలింగ్ కి గురి కావాల్సిందే.
ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు టంగ్ స్లిప్ అవడంతో పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా నటుడు నాచురల్ స్టార్ నాని సైతం ఇలాంటి వివాదంలో చిక్కుకున్నారు. ఈయన ప్రస్తుతం దసరా అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా మార్చి 30 వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.
ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా ఇందులో నాని తెలంగాణ యాసలో మాట్లాడుతూ అందరిని మెప్పించారు ఇక ఈ టీజర్ లో బాంచత్ అనే పదాన్ని కూడా ఉపయోగించారు. అయితే ఇక్కడికి ఈ విషయం గురించి ఎలాంటి వివాదం చెలరేగలేదు. కానీ తాజాగా ఈ సినిమా నుంచి ఓరి వారి అనే పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విలేకరులు అడిగే ప్రశ్నలకు నాని సమాధానం చెప్పారు.
ఈ క్రమంలోనే ఒక రిపోర్టర్ నానిని ప్రశ్నిస్తూ… బాంచత్ అనే పదాన్ని ఎలా వాడుతారు అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు నాని సమాధానం చెబుతూ భాంచత్ అనేది పెద్ద బూతు పదం ఏమీ కాదు దానిని ఎవరైనా వాడవచ్చు స్కూల్ కి వెళ్లే పిల్లలు కూడా ఈ పదం వాడవచ్చు అని చెప్పారు ఇలా స్కూల్ కి వెళ్లే పిల్లలు కూడా ఈ పదం వాడమని నాని చెప్పడమే ఇప్పుడు ఈ విషయం కాంట్రవర్సీగా మారి పెద్ద ఎత్తున వివాదానికి కారణమైంది. నాని అలా ఎలా చెబుతారు అంటూ పెద్ద ఎత్తున నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…