Anchor Anasuya: యాంకర్ అనసూయ పరిచయం అవసరం లేని పేరు ఒకప్పుడు బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరమవుతూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.ఇలా సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అందరితో పంచుకుంటారు. అయితే కొన్నిసార్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతూ ఉంటారు.
ఈ క్రమంలోని సోషల్ మీడియా వేదికగా ఈమె చేసే పోస్టులకు నెటిజన్స్ నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావటం వల్ల ఈమె తన గురించి వచ్చే వ్యతిరేకతపై స్పందిస్తూ పెద్ద ఎత్తున ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలా ఎన్నోసార్లు వివాదాలలో చిక్కుకున్న అనసూయ తాజాగా మరోసారి నెటిజన్లపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.ఈ క్రమంలోనే అనసూయ వాలెంటైన్స్ డే సందర్భంగా తన భర్తతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు. ఇలా ఈ ఫోటోని షేర్ చేస్తూ ఫోటోకి చిన్న క్యాప్షన్ ఇచ్చారు.
నీతో లైఫ్ చాలా క్రేజీగా రోలర్ కోస్టర్ రైడర్‌లా ఉంటుందని రాసుకొచ్చింది. దీనికి వెంటనే ఓ నెటిజెన్ రియాక్ట్ అవుతూ.. అలా ఏం లేదు అక్క. వాడి దగ్గర డబ్బు ఉంది అందుకే… అంటూ కామెంట్ చేశాడు. ఇక అనసూయకు కోపం వచ్చింది. ఈ క్రమంలోని సదురు నేటిజన్ కి తనదైన స్టైల్ లో సమాధానం చెప్పింది. అదేంట్రా తమ్ముడు అలా అనేసావ్ ఎంతుందేంటి డబ్బు అంటూ ప్రశ్నించారు.
డబ్బు నా దగ్గర లేదా అయినా మీకు అన్ని తెలుసు కదా ఆయన డబ్బు వేరు నా డబ్బు వేరు అని ఎక్కడైనా ఉంటుందా… అయినా బావగారిని పట్టుకొని వాడు వీడు అనడం ఏంట్రా..అలా అనకూడదు ముందు చంపలేసుకో లేదంటే నేను వేయాల్సి వస్తుంది చెప్పుతో అదే చెంపలు అంటూ ఏకంగా సదరు నెటిజన్ ను చెప్పుతో కొడతా అంటూ ఈమె వార్నింగ్ ఇచ్చారు.ఇలా తమ్ముడు అంటూనే అనసూయ తీవ్రస్థాయిలో ఫైర్ అవడంతో ఇందుకు సంబంధించిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…