Categories: FeaturedMovie News

అందరిలో నా నడుము గిల్లాడు…! సీనియర్ హీరోయిన్ లతాశ్రీకి ఎదురైన చేదు అనుభవం !!

సీనియర్ హీరోయిన్ లతా శ్రీ గురించి ఈతరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. అప్పటి ప్రేక్షకులకు లతాశ్రీ సుపరిచితమే. తన సినీ కెరీర్ ప్రారంభంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆ తరువాత చెల్లెలి పాత్రల్లో నటిస్తూ వచ్చింది. ‘యమలీల’ ‘నెంబర్ వన్’ ‘ఆ ఒక్కటీ అడక్కు’ వంటి హిట్ చిత్రాల్లో ఈమె నటించింది. ముఖ్యంగా ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాలో “జెండా ఎత్తేస్తా” అనే డైలాగ్ తో ఈమె బాగా పాపులర్ అయ్యింది. ఇక ఈమె తెలుగుతో పాటు కన్నడ, హిందీ భాషల్లో 80కి పైగా సినిమాల్లో నటించింది. తెలుగు తెరపై విభిన్నమైన పాత్రల ద్వారా లతాశ్రీ ప్రేక్షకులను మెప్పించారు. లతాశ్రీ అసలు పేరు ‘పద్మలత’ .. సినిమాల్లోకి వచ్చాక ‘శ్రీలత’గా మార్చారు. ఆ తరువాత ‘లతాశ్రీ’ అని మార్చుకుంటే కలిసొస్తుందని ఒక సిద్ధాంతి చెబితే అలా మార్చుకుంది. నిజంగానే అప్పటి నుంచి అవకాశాలు పెరిగాయి.

మొదటి నుంచి లతాశ్రీకి డాన్స్ , నటన అంటే ఇష్టం. విజయవాడలో పదో తరగతి చదువుతుండగానే తమ్మారెడ్డి భరద్వాజాగారి సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా విడుదలైన తరువాత ‘పోలీస్ భార్య’లో నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో, ఇక కెరియర్ పరంగా వెనుదిరిగి చూసుకోలేదు లతాశ్రీ. 1990లో జిమ్ ట్రైనర్‌ను ప్రేమించి పెళ్లాడిన లతా శ్రీ.. ఆ తరువాత నటనా రంగానికి స్వస్తి చెప్పేసింది. లతాశ్రీ చివరిగా అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘అత్తిలి సత్తిబాబు ఎల్.కె.జి’ అనే చిత్రంలో నటించింది.

ఇదిలా ఉండగా.. ‘పోలీస్ భార్య’ అనే హిట్ చిత్రంలో ఓ బోల్డ్ పాత్ర పోషించింది లతా శ్రీ. ఆ చిత్రం 100 రోజుల ఫంక్షన్లో లతాశ్రీకి ఓ చేదు అనుభవం ఎదురైందట. ఆ సంఘటన గురించి లతా శ్రీ మాట్లాడుతూ.. “సాధారణంగా నాకు కొంచెం కోపం ఎక్కువ. ‘పోలీస్ భార్య’ సినిమా 100 రోజుల ఫంక్షన్ జరుగుతున్న రోజు నాకు ఓ చేదు సంఘటన ఎదురైంది. ఆ రోజుల్లో ఆర్టిస్ట్‌లు పెద్దగా బయటకు వచ్చేవారు కాదు. ఆ ఫంక్షన్ కు పెద్ద మొత్తంలో జనం వచ్చారు. ఆర్టిస్ట్‌లు అందరం కలిసి వెళ్తుంటే..

ఒకడు వచ్చి నా నడుముని గిల్లేశాడు. నాకు చాలా కోపం వచ్చి వాడివైపు చూసాను.. అయినా సరే మళ్లీ ఏదో చెయ్యడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు వాడి చేయి పట్టుకుని ఒక్కటిచ్చాను. వెంటనే వాడు అక్కడ నుండీ వెళ్లిపోయి ఓ పదిమందిని వెంటేసుకుని వచ్చాడు. ‘ఏంటి మావాడ్ని కొట్టావ్’ అంటూ వాళ్ళు నా మీదికి వస్తుంటే.. ఆ టైం లో నా ప్రక్కనే ఉన్న హీరో నరేష్ గారు వాళ్లను కొట్టి వెనక్కి నెట్టేసి.. వెంటనే పోలీసుల్ని పిలిచించారు. తరువాత ఆయనే నన్ను ప్రొటెక్ట్ చేస్తూ వ్యాన్ ఎక్కించి ఇంటికి పంపారు. ఆ సంఘటనతో హీరో నరేష్ గారు రియల్ హీరో అనిపించుకున్నారు.” అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది లతాశ్రీ.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago