Director Parvatheesam : పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన అనంతరం కేరింత సినిమాతో నటుడు పార్వతీశం పరిచయమయ్యారు. ఈ క్రమంలోనే పలు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన రెండు సినిమాలలో నటించారు. మారుతి దర్శకత్వంలోనూ రోజులు మారాయి, భలే మంచి చౌక బేరం వంటి రెండు సినిమాలలో నటించినట్టు ఈయన తెలిపారు.
ఇకపోతే కేరింత సినిమాలో నటించడం కోసం పార్వతీశం దిల్ రాజుకు డబ్బులు ఇచ్చినట్లు పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. ఈ విషయం గురించి ప్రశ్నించగా దిల్ రాజు గారికి నేను డబ్బులు ఇవ్వడం ఏంటి అంటూ ఈయన ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. ఇకపోతే మారుతి గారు మీకు పేమెంట్ ఇవ్వడానికి ఇబ్బందులు పెట్టారు అని కూడా వార్తలు వచ్చాయని ప్రశ్నించగా ఈ విషయం గురించి పార్వతీశం క్లారిటీ ఇచ్చారు.
ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలలో ఒక్కరు కూడా పేమెంట్ ఎగ్గొట్ట లేదని మారుతి గారు కూడా ఎప్పుడూ తనని పేమెంట్ కోసం ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. ఇక మారుతి గారి ప్రొడక్షన్ లో చేసిన ఈ రెండు సినిమాలకు కూడా ఆయన కరెక్ట్ గా పేమెంట్ ఇచ్చారని తెలిపారు. ఇక సార్ పేమెంట్ కావాలని అతనికి చిన్న మెసేజ్ చేస్తే చాలు గంటలో నా అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అవుతాయని తెలిపారు.
ఒకవేళ క్యాష్ కనుక ఉంటే ఆఫీస్ కి వెళ్లి తీసుకో అంటూ తనకు సమాధానం చెబుతారు కానీ ఆయన పేమెంట్ విషయంలో ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. ఇక చోటా కె నాయుడు గురించి మాట్లాడుతూ ఆయన ఎంతో మంచివారని ఆయన స్టైల్, ఆయన డిగ్నిటీ ఎంతో బాగుంటుందని ఈ సందర్భంగా నటుడు పార్వతీశం చోటా కె నాయుడు గురించి తెలిపారు.తను ఒకసారి ఎవరైనా ఇష్టపడితే ఎంతో ప్రేమగా చూసుకుంటారని అంత మంచి మనస్తత్వం అని పార్వతీశం ఈ సందర్భంగా చోటా కె నాయుడు గురించి తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…