Actor Ponnambalam: తమిళ సినిమా ఇండస్ట్రీలో విలన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి తన విలనిజంతో అందరిని భయపెట్టినటువంటి వారిలో నటుడు పొన్నంబలం ఒకరు. అయితే పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన గత కొద్ది రోజుల క్రితం కిడ్నీలు పాడవడంతో చెన్నైలోనే ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
ఒక కిడ్నీ పూర్తిగా పాడవడంతో తన సమీప బంధువు తనకు కిడ్నీ దానం చేయడంతో ఫిబ్రవరి 10వ తేదీన కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. ఈ క్రమంలోనే ఈయన ప్రస్తుతం కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని తెలుస్తోంది. ఇలా ఇంటికి వెళ్ళగానే ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన అనారోగ్య సమస్యల గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందించారు.
ఈ సందర్భంగా నటుడు పొన్నంబలం మాట్లాడుతూ అందరూ నేను మద్యం సేవించడం మాదకద్రవ్యాలు తీసుకోవడం వల్ల తన ఆరోగ్యం పాడై ఆస్పత్రి పాలయ్యానని భావిస్తున్నారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని ఈయన తెలియజేశారు. కానీ తనపై విష ప్రయోగం జరిగింది అంటూ ఈ సందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేశారు.
తన తండ్రికి నలుగురు భార్యలని తన తండ్రి మూడవ భార్య కుమారుడు తన వద్ద మేనేజర్ గా పని చేస్తున్నారని తెలిపారు. అయితే తన తమ్ముడే తనకు స్లో పాయిజన్ ఇస్తూ వచ్చాడని ఆ విషయం తనకు తెలియదని తెలిపారు.ఇలా తను స్లో పాయిజన్ ఇవ్వడం వల్లే తన కిడ్నీల ఆరోగ్యం పాడయ్యాయని అంతకుమించి తనకు ఉన్నటువంటి అలవాట్ల కారణంగా తన ఆరోగ్యం పాడవలేదని ఈయన తెలిపారు.ఇలాంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…