Actor Pruthvi Raj : గత ఏడాది సీనియర్ నటుడు పృథ్వీ రెండో పెళ్లి వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ‘రుక్కు రుక్కు రుక్కుమని రమనిసుగుణమని’ పాట అనగానే గుర్తొచ్చే పేరు పృథ్వీ. ఆ పాటలు వచ్చి ఎన్నేళ్లయినా ఇప్పటికీ ఆయనను ‘పెళ్లి’ సినిమా పృథ్వీ గానే గుర్తుపడతారు తెలుగు ప్రేక్షకులు. సినిమాలతో మొదలు పెట్టి సీరియల్స్ లోకి వెళ్లి తమిళ సీరియల్స్ తో బాగా ఫేమస్ అయిన పృథ్వీ తెలుగులో మాత్రం పెళ్లి పృథ్వీగా బాగా ఫేమస్ అయ్యాడు. పెళ్లి సినిమా కంటే ముందే పృథ్వీ తెలుగులో సినిమాలు చేసినా ఆ సినిమాతో వచ్చిన ఫేమ్ వల్ల పెళ్లి పృథ్వీగా పేరు తెచ్చుకున్నాడు. తరువాత అడపాదడపా సినిమాలు చేసినా మళ్ళీ సమరసింహా రెడ్డి, మన్మధుడు, చెన్నకేశవ రెడ్డి వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. హీరోగానే నటించాలనే నియమేమీ పెట్టుకోకుండా ఇతర హీరోల సినిమాలలో కూడా నటించాడు పృథ్వీ. తాజాగా మరోసారి విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు రావడంతో వైరల్ అవుతున్నాడు.
రుక్మిణి శీతల్ తో విడిపోనున్న పృథ్వీ??
మధ్య కాలంలో విడిపోవడం పెళ్లి చేసుకోవడం అన్నీ బాగా కామన్ అయిపోయాయి. విడిపోడానికి పెద్దగా కారణాలు ఉండటం లేదు, ఇక కలిసుండటానికి కారణాలు వెతుక్కోవడం లేదు. ఇదంతా యువతరం మాత్రమే చేయడం లేదు, ఐదు పదుల వయసుదాటిన వాళ్ళు కూడా విడాకులు, మళ్ళీ పెళ్లిళ్లు అంటున్నారు.
మొదటి భార్య బీనాతో విడాకులు తీసుకున్న తరువాత తనకంటే వయసులో చాలా చిన్నదైన దాదాపు 33 ఏళ్ల వయసు తేడా ఉన్న పృథ్వి, రుక్మిణి శీతల్ జంట గత ఏడాది వివాహం చేసుకున్నారు. కాగా తాజాగా ఈ జంట విడిపోతున్నారనే కథనాలు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉన్నాయి. రుక్మిణి శీతల్ తన సోషల్ మీడియా ఖాతాల నుండి పృథ్వి తనకు ప్రపోజ్ చేసిన వీడియోను డిలీట్ చేయడమే ఈ అనుమానాలకు తావిస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజాలున్నాయనే విషయం తెలియాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…