Senior PRO Vinayakarao : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ వారసుడిగా తెలుగు సినిమాలకు పరిచయం అయ్యాడు వడ్డే నవీన్. చేసినది తక్కువ సినిమాలే అయినా అనతి కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘కోరుకున్న ప్రియుడు’ సినిమాతో తన సినీ ప్రయాణం మొదలు పెట్టాడు. ‘పెళ్లి’ సినిమా మంచి విజయాన్ని అందించింది. కేవలం 30 సినిమాలలో మాత్రమే నటించిన వడ్డే నవీన్ తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ సంపాదించడం అలాగే తక్కువ సమయంలోనే ఫేడ్ అవుట్ అవ్వడం జరిగింది. అయితే కుటుంబ కథా చిత్రాలతో అభిమానులకు బాగా దగ్గరయ్యాడు వడ్డే నవీన్. ఇక ఆయన గురించి చాలా రోజులకు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వడ్డే నవీన్ సినిమాలకు దూరం అవడానికి అదే కారణం…
వడ్డే నవీన్ కుటుంబ కథా చిత్రాల హీరోగా మంచి పేరు తెచ్చుకుని అప్పుడప్పుడే ఎదుగుతున్న సమయంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పేశాడు. అయితే ఆయన అలా చేయడానికి కారణం ఏంటనేది ఇప్పటికీ క్లారిటీ లేకపోయినా ఆయన వద్ద పిఆర్ఓ గా పనిచేసిన వినాయకరావు గారు ఆయన గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన వరుసగా ఫ్లాప్స్ ఎదుర్కోవడం, కథ ఎంపిక సరిగా చేయకపోవడం వల్లే ఆయన కెరీర్ గ్రాఫ్ పడిపోయిందని చెప్పారు.
అలా ఆయన సినిమా తెరకు దూరం అయ్యారని చెప్పారు వినాయకరావు. వినాయకరావు గారు అటు సినిమా జర్నలిస్ట్ గా పనిచేస్తూనే మరోవైపు హీరోలు శ్రీకాంత్, వడ్డే నవీన్, కృష్ణం రాజు గారు వంటి వారికి పిఆర్ఓ గా పనిచేశారు. ఇక ఇవే కాకుండా ఆయన కృష్ణ, దాసరినారాయణ రావు గారు, విజయనిర్మల, రామానాయుడు వంటి సినిమా పెద్దల జీవితాలను పుస్తకాల రూపంలోకి తీసుకొచ్చారు. తాజాగా చిరంజీవి గారి గురించి కూడా పుస్తక రచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…