Featured

Actor Saikiran: వారిని నమ్మి లక్షల్లో మోసపోయిన నువ్వే కావాలి నటుడు సాయి కిరణ్.. పోలీసులకు ఫిర్యాదు?

Actor Saikiran: మోసం చేసే వాళ్ళు ఉంటే ఎలాంటి వారైనా మోసపోతారని అందరికీ తెలిసిన విషయమే. ఇలా ఎంతో మంది చదువుకున్న మేధావులు పెద్దపెద్ద వ్యాపారస్తులు, సినీ సెలబ్రిటీలు సైతం ఇతరులను నమ్మి దారుణంగా మోసపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే నువ్వేకావాలి సినిమాల్లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సాయి కిరణ్ సైతం దారుణంగా మోసపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈయన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

Actor Saikiran: వారిని నమ్మి లక్షల్లో మోసపోయిన నువ్వే కావాలి నటుడు సాయి కిరణ్.. పోలీసులకు ఫిర్యాదు?

సాయి కిరణ్ నిర్మాత జాన్ బాబు , లివింగ్ స్టెన్‌ల పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మన్న మినిస్ట్రీస్ లో సభ్యత్వం పేరుతో సాయి కిరణ్ దగ్గర నుంచి వీరిద్దరూ రూ.10.6 లక్షల రూపాయలను తీసుకొని తిరిగి ఇవ్వకుండా దారుణంగా మోసం చేశారని డబ్బులు అడిగితే తనని బెదిరిస్తున్నారని ఈయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈయన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని జాన్ బాబు, లివింగ్ స్టెన్ లపై 420,406 సెక్షన్స్ కింద కేసు ఫైల్ చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Actor Saikiran: వారిని నమ్మి లక్షల్లో మోసపోయిన నువ్వే కావాలి నటుడు సాయి కిరణ్.. పోలీసులకు ఫిర్యాదు?

ఇలా సాయికిరణ్ నిర్మాతల చేతిలో దారుణంగా మోసపోవడంతో ఈ విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇక ఈయన కెరీర్ విషయానికి వస్తే ప్రముఖ సింగర్ రామకృష్ణ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయికిరణ్ నువ్వే కావాలి సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం పలు సినిమాలలో హీరోగా నటించారు.ఇకపోతే ప్రస్తుతం ఈయన బుల్లితెర టీవీ సీరియల్స్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు.

దేవుడి పాత్రలలో సందడి చేసిన సాయి కిరణ్…

బుల్లితెర సీరియల్స్ మాత్రమే కాకుండా పలు వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, విష్ణు వంటి దేవుడి పాత్రలో కూడా ఈయన ఎంతో అద్భుతంగా నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ప్రస్తుతం సాయికిరణ్ బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా విశేష ఆదరణ సంపాదించుకున్నారు. తెలుగుతో పాటు కన్నడ సీరియల్స్ లో నటిస్తూ సాయికిరణ్ బిజీగా ఉన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

6 hours ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

2 days ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

2 days ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

2 days ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

2 days ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

2 days ago