Featured

Actor Sameer : నన్ను గేట్ లోపలికి కూడా వెళ్లనివ్వలేదు.. చాలా అవమానించారు చిరంజీవి గారికి చెప్పినా ఉపయోగం లేకుండా పోయింది…: నటుడు సమీర్

Actor Sameer : దూరదర్శన్ లో కెరీర్ మొదలు పెట్టి సీరియల్స్ లో నటించిన సమీర్ రుతురాగాలు, శాంతి నివాసం వంటి సీరియల్స్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక బాలసుబ్రమణ్యం గారు నిర్మించిన శుభ సంకల్పం సినిమాలో నటించిన సమీర్ ఆ తరువాత చాలా సినిమాల్లో సహాయం నటుడుగా చేసాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్ గా వచ్చి అలరించిన సమీర్ సినిమాల్లోను అటు టీవీ ప్రోగ్రామ్స్ లోనూ కనిపిస్తున్నారు. తన కెరీర్ మొదట్లో పడ్డ కష్టాలను ఇటీవల ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

గేట్ దగ్గరే ఆపేసారు….

సమీర్ సొంతూరు వైజాగ్ అక్కడి నుండి సినిమాల్లో , టీవీ రంగంలో అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చాడు. వైజాగ్ లో ఉంటున్న సమయంలోనే రెండు సినిమాల్లో అవకాశాలు అందుకున్న సమీర్ ఆ తరువాత హైదరాబాద్ కి వచ్చేసాడు. అయితే అప్పట్లో సెల్ ఫోన్లు లేకపోవడం వల్ల తనకు ఒక మంచి ఆఫర్ పాయిందంటూ సమీర్ చెప్పారు. అందరూ అప్పట్లో పేజర్ వాడేవారు కానీ సమీర్ తో పేజర్ లేకపోవడంతో తన కజిన్ నెంబర్ ను కాంటాక్ట్ కోసం ఇచ్చాడు చాలా మందికి అలా కృష్ణ రెడ్డి గారి సినిమాలో కృష్ణ గారి పక్కన నటించే అవకాశం వచ్చిన లేట్ గా విషయం తెలియడం వల్ల అవకాశం పోయినదంటూ చెప్పారు. ఇక శుభ సంకల్పం సినిమా విజయం తరువాత రవీంద్ర భారతి లో అవార్డు ఫంక్షన్స్ జరగడంతో నాకు తెలిసీ వెళితే అక్కడ గేట్ వద్దే నన్ను ఆపేసారంటు చెప్పారు సమీర్.

నేను ఆ సినిమాలో నటించనని చెప్పినా వినలేదు ఇక చాలా సేపు బ్రతిమాలాక మొదటి గేట్ లో పంపారు. లోపలికి వెళ్లాలంటే ఇంకో గేట్ దాటాలి అయితే అక్కడ ఎంత అడిగిన లోపలికి పంపలేదు. నా పేరు లోపల పిలుస్తున్నారు అది నాకు వినబడుతోంది కానీ నేను చూపించడానికి నా దగ్గర ఇన్విటేషన్ లేకపోవడంతో ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోలేక పోయాను అంటూ చెప్పారు. ఇక ఆ షీల్డ్ మళ్ళీ బాలు గారినే అడిగిన నాకు దక్కలేదు. ఇక ఇంద్ర సినిమా అప్పుడు ఇలానే జరిగింది. అవార్డు చిరంజీవి గారి చేతుల మీదుగా అందుకున్నాను. అయితే సినిమా టీం మళ్ళీ ఇప్పించుకుని ఇంటికి పంపుతాం అందరివీ ఇవ్వండని తీసుకున్నారు ఇప్పటికీ రాలేదు. నేరుగా అశ్విని దత్ గారినే అడిగిన ఆయన నాది ఉంది తీసుకో అని చెబితే ఆఫీస్ కెళ్ళి చూస్తే ఆయనది కూడా లేదు. ఇక చిరంజీవి గారిని అడిగాను ఆయన నాదే లేదు నీకక్కడ ఇవ్వను అన్నారు అంటూ చెప్పారు సమీర్.

Bhargavi

Recent Posts

కోటిన్నర రూపాయల ఇంజెక్షన్ కోసం పోరాటం.. స్పందించిన సీఎం..

తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…

15 hours ago

బెంగళూరులో చిన్నారి మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మూడు నెలల తర్వాత తల్లి అరెస్ట్..

బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…

16 hours ago

ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ టమాటాలు.. గుర్తించే సింపుల్ టెస్టులు ఇవే..

ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…

16 hours ago

మామిడి పండ్లు తిన్న తర్వాత అనారోగ్యం.. ఇద్దరు బాలికల మరణం కలకలం

హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…

16 hours ago

ప్రపంచానికి కొత్త వాతావరణ హెచ్చరిక.. ‘గాడ్జిలా ఎల్‌నినో’పై నిపుణుల ఆందోళన

ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…

19 hours ago

నాన్న ఇప్పటికీ ఆటోనే నడుపుతున్నారు..స్టార్ కొరియోగ్రాఫర్ అయినా సొంత ఇల్లు లేదు..పండు మాస్టర్ ఎమోషనల్ స్టోరీ

తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…

19 hours ago