Categories: FeaturedMovie News

Actor Sandesh : ఆర్పీ పట్నాయక్ సంగీతం రాదు.. అసలు నేర్చుకోలేదు కూడా : నటుడు సందేశ్

Actor Sandesh : ఆర్ నారాయణ మూర్తి గారి సినిమా ‘ఊరు మనదిరా’ సినిమాతో గుర్తింపు తెచ్చికున్న నటుడు సందేశ్. సందేశ్ బూరి గారి తొలిచిత్రం ఎల్లమ్మ, షేక్స్ పియర్ నవల ఆధారంగా తెలంగాణ నేటివిటీకి తగ్గట్టు తీసిన సినిమాలో సందేశ్ గారు మొదట నటించారు. మొదటి సినిమాలోనే నాజర్, రేవతి సోనాలి కులకర్ణి వంటి మంచి నటులతో నటించే అవకాశాన్ని అందుకున్నారు. సందేశ్ గారు పలు సీరియల్స్ లో కూడా నటించారు. అయితే ఆయనకు ఊరు మనదిరా సినిమాతో పాటు నాతిచరామి, ప్రభంజనం, మిస్టర్ గిరీషం సినిమాలు మంచి పేరును తెచ్చాయి. ఇక ఇటీవల ఇంటర్వ్యూలో తన స్నేహితుడు మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ గురించి మాట్లాడారు.

ఆర్పీ పట్నాయక్ సంగీతం నేర్చుకోలేదు…

ఆర్పీ పట్నాయక్ సంగీతం గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఆయన అందించారు. ప్రస్తుతం ఆయన సినిమాలను చేయడం లేదు కానీ ఒకానొక సమయంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఆర్పీ ఉండేవారు. ఆయన చేసిన అన్ని సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి.

ఆలాంటి ఆర్పీ గారు అసలు సంగీతం నేర్చుకోలేదు అంటే నమ్మబుద్ధి కాదు. కానీ నిజానికి ఆర్పీ గారు ఎటువంటి సంగీత శిక్షణ తీసుకోకుండానే పట్టు సాధించారట. ఈ మాటే ఆయన స్నేహితుడు సందేశ్ చెబుతారు. ఆర్పీ అసలు సంగీతం నేర్చుకోలేదు. తనకు పుట్టుకతోనే దేవుడు వరంగా ఆ నేర్పు ఇచ్చాడు అంటూ చెప్పారు. చాలా మంచి వ్యక్తి, స్నేహం కోసం తాను చేయగలిగినంత సాయం చేస్తాడు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago