Tarun Bhaskar: పెళ్లిచూపులు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దర్శకుడుగా పరిచయమయ్యారు తరుణ్ భాస్కర్. దర్శకుడిగా పలు సినిమాలకు దర్శకత్వం వహించిన ఈయన ఈ మధ్యకాలంలో సినిమాలకు దర్శకత్వం మానేసి పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే తరుణ్ భాస్కర్ సీతారామం సినిమాలో బాలాజీ అనే పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.
ఈ విధంగా పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి ఈయన త్వరలోనే కోడా కోలా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ కనుక చూస్తుంటే కూల్ డ్రింక్ తయారీకి పురుగుల మందుకు ఉన్నటువంటి కనెక్షన్ గురించేనని టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది అయితే త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన పలు విషయాల గురించి ప్రస్తావించారు. అయితే ఈ మధ్యకాలంలో ఏ సినిమా నుంచి ఒక పోస్టర్ విడుదలైన టీజర్ విడుదలైన ఫలానా సినిమా నుంచి కాపీ కొట్టారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు సృష్టిస్తూ ఉంటారు.ఈ విషయం గురించి తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ ఒక సినిమా పోస్టర్ లో తుపాకీ కనపడితే చాలు పలానా సినిమా నుంచి కాఫీ అంటూ కామెంట్ చేస్తారు.
ఒక బ్యాట్ కనిపించిన అంతే జెర్సీ సినిమా నుంచి కాపీ కొట్టారు అంటూ చాలామంది మాట్లాడుతూ ఉంటారు.
ఈ విధంగా మాట్లాడే హౌలే గాళ్ళను మస్తు కొట్టాలని అనిపిస్తుంది అంటూ ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…