టాలీవుడ్ లో నానీ హీరోగా బంపర్ హిట్ కొట్టిన చిత్రం జెర్సీ. 2019లో ఈ సినిమా విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీనికి ఎన్నో అవార్డులు కూడా వరించాయి. ఇక దీనిని హిందీ రిమేక్ లో డిసెంబర్ 31 న అదే పేరుతో విడుదల చేయనున్నారు. దీనిలో హీరోగా షాహిద్ కపూర్ నటించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించారు.
ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జెర్సీకి సంబంధించి విశేషాలను చిత్ర బృందం పంచుకుంది. హీరో షాహిద్ కపూర్ మాట్లాడుతూ.. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాకు హిందీ రిమేక్ లో వచ్చిన సినిమా కబీర్ సింగ్. ఈ సినిమా తన జీవితంలో గొప్ప విజయమన్నారు. ఆ సినిమాకు సంబధించి కొన్ని ట్రోల్ చేసినా.. మంచి విజయం సాధించిందన్నారు. 18 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న తనకు ఇంత పెద్ద భారీ కలెక్షన్లు రాలేదన్నారు.
కబీర్ సింగ్ సినిమాతో తన క్రేజ్ ఒక్కసారిగా మారిపోయిందన్నారు. ఆ సినిమా నుంచే తనకు యాక్షన్ సినిమాలు చేయమని ఎంతో మంది సలహాలు ఇచ్చారన్నారు. అందుకే నిర్మాతల వద్దకు వెళ్లాలనని వాళ్లు రూ.200 నుంచి 300 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాలు తీయడానికి ఒప్పుకున్నారని.. తాను ఇంత వరకు అంత భారీ బడ్జెట్ తో సినిమాలు తీయలేదని ఎమోషనల్ అయ్యారు. ఆ ఘనత కేవలం కబీర్ సింగ్ సినిమాతో దక్కిందన్నారు. ఇక జెర్సీ సినిమా కథ తనకు చాలా నచ్చిందని.. ఆ సినిమా చివర్లో ఏడ్చేశాను అని చెప్పారు.
ఈ సినిమాను అతడు కబీర్ సింగ్ విడుదలకు కాకముందే చూశానన్నారు. ఈలోపు నేను కబీర్‌సింగ్ చేస్తుండటంతో జెర్సీ వాయిదా పడిందని.. అయినప్పటికీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి నాకోసం ఎంతో కాలం ఎదురుచూశారన్నారు. ఈ సందర్భంగా అతడు గౌతమ్‌కి థ్యాంక్స్ చెప్పారు. ఇక ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో జెర్సీ ది బెస్ట్ అని అన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…