ఆ సినిమా చూసి ఏడ్చేశాను.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా: షాహిద్ కపూర్

0
41

టాలీవుడ్ లో నానీ హీరోగా బంపర్ హిట్ కొట్టిన చిత్రం జెర్సీ. 2019లో ఈ సినిమా విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీనికి ఎన్నో అవార్డులు కూడా వరించాయి. ఇక దీనిని హిందీ రిమేక్ లో డిసెంబర్ 31 న అదే పేరుతో విడుదల చేయనున్నారు. దీనిలో హీరోగా షాహిద్ కపూర్ నటించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించారు.

ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జెర్సీకి సంబంధించి విశేషాలను చిత్ర బృందం పంచుకుంది. హీరో షాహిద్ కపూర్ మాట్లాడుతూ.. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాకు హిందీ రిమేక్ లో వచ్చిన సినిమా కబీర్ సింగ్. ఈ సినిమా తన జీవితంలో గొప్ప విజయమన్నారు. ఆ సినిమాకు సంబధించి కొన్ని ట్రోల్ చేసినా.. మంచి విజయం సాధించిందన్నారు. 18 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న తనకు ఇంత పెద్ద భారీ కలెక్షన్లు రాలేదన్నారు.

కబీర్ సింగ్ సినిమాతో తన క్రేజ్ ఒక్కసారిగా మారిపోయిందన్నారు. ఆ సినిమా నుంచే తనకు యాక్షన్ సినిమాలు చేయమని ఎంతో మంది సలహాలు ఇచ్చారన్నారు. అందుకే నిర్మాతల వద్దకు వెళ్లాలనని వాళ్లు రూ.200 నుంచి 300 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాలు తీయడానికి ఒప్పుకున్నారని.. తాను ఇంత వరకు అంత భారీ బడ్జెట్ తో సినిమాలు తీయలేదని ఎమోషనల్ అయ్యారు. ఆ ఘనత కేవలం కబీర్ సింగ్ సినిమాతో దక్కిందన్నారు. ఇక జెర్సీ సినిమా కథ తనకు చాలా నచ్చిందని.. ఆ సినిమా చివర్లో ఏడ్చేశాను అని చెప్పారు.

ఈ సినిమాను అతడు కబీర్ సింగ్ విడుదలకు కాకముందే చూశానన్నారు. ఈలోపు నేను కబీర్‌సింగ్‌ చేస్తుండటంతో జెర్సీ వాయిదా పడిందని.. అయినప్పటికీ దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి నాకోసం ఎంతో కాలం ఎదురుచూశారన్నారు. ఈ సందర్భంగా అతడు గౌతమ్‌కి థ్యాంక్స్ చెప్పారు. ఇక ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో జెర్సీ ది బెస్ట్ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here