Shivaji Raja : తెలుగులో క్యారెక్టర్ అరిస్ట్ గాను, విలన్ గాను కమెడియన్ గాను హీరోగాను సినిమాల్లో నటించిన నటుడు శివాజీ రాజా. ఏ మాత్రం బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకొని ఎదిగాడు. సినిమాలలో ఎంత ఫేమస్ అయ్యారో బుల్లితెర మీద సీరియల్స్ లోను ముఖ్యంగా ‘అమృతం’ వంటి సీరియల్ లో ఆయన అమృత రావు క్యారెక్టర్ లో పండించిన కామెడీ తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. ఇక ఇటీవల హీరోలకు తండ్రిగా కూడా నటిస్తున్న శివాజీ రాజా సెలెక్టెడ్ గా సినిమాలను చేస్తున్నారు. ఇక తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాజీ మా అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గురించి మాట్లాడారు.
మా అసోసియేషన్ కు సొంత భవనం పేరుతో మొన్నటి మా ఎలక్షన్స్ లో మంచు విష్ణు గెలిచారు. ఆయన మా అధ్యక్షుడు అయి ఏడాది గడిచినా ఇప్పటికీ పునాది కాదుకదా ఇటుక కూడా పడలేదు. ఇక ఇదే అంశం గురించి శివాజీ రాజా మాట్లాడుతూ మా బిల్డింగ్ కట్టాలనే చొరవ తీసుకునే వారు ఉంటే కట్టడం ఎక్కువకాలం పట్టదు. విరాళంగా డబ్బులను ఇవ్వడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు కానీ చొరవ చూపి అడిగే వారే లేరు. అమెరికా లో ప్రోగ్రామ్ చేసి ఆ వచ్చిన డబ్బులు మా అసోసియేషన్ కోసం ఇవ్వాలని అనుకున్నపుడు ఎంతో బిజీగా ఉన్న చిరంజీవి గారు అమెరికా వచ్చారు.
ఇక మహేష్ ను అడిగితే మీరు చెప్పండి మేము చేస్తాం అన్నట్లు చెప్పారు. ఇక ప్రభాస్ అయితే ఏకంగా ఆ ప్రోగ్రామ్ అంతా చేస్తే మీకు ఎన్ని డబ్బులు సమకురతాయో చెప్పండి అంత కష్టపడటం ఎందుకు అదంతా నేనే ఇచ్చేస్తా అంటూ చెప్పారట. ఇలా అందరు అగ్ర హీరోలు తమవంతు సహాయం చేయడానికి ముందున్నారు. కానీ చొరవగా అడిగి చేసే వాళ్ళు లేరు అంటూ చెప్పారు శివాజీరాజా. ఇక మా అసోసియేషన్ లో ఒక వ్యక్తి గురించి పరోక్షంగా మాట్లాడుతూ అలాంటి బొకడా గాళ్ళను చాలా మందిని నా జీవితంలో చూసాను అంటూ మాట్లాడారు. నేను ఎవరి గురించి అంటున్నానో వారికి ఈ స్టేట్మెంట్ వింటేనే అర్థమవుతుంది నేను అన్నది వాళ్లనే అని పేరు చెప్పనక్కర్లేదు అంటూ మాట్లాడారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…