Siddharth: సినీనటుడు సిద్ధార్థ్ తరచు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తలలో నిలుస్తుంటారు. అయితే ప్రస్తుతం ఈయన భారతీయుడు 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ఇటీవల హైదరాబాద్ లో సందడి చేశారు.
ఇకపోతే ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సినిమా టికెట్లు రేట్లు పెంచాలంటే ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా సైబర్ క్రైమ్స్ డ్రగ్స్ వంటి వాటిపై అవగాహన కల్పిస్తూ ఒక వీడియో చేయాలని సూచించారు. ఇక భారతీయుడు 2 ప్రమోషన్లలో ఈ షరుతుకు సంబంధించిన ప్రశ్న రిపోర్టర్ వేయగ ఈయన ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.
నేను ఒక 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. 2005 నుంచి 2011 వరకు నేను కండోమ్స్ ను ప్రమోట్ చేశాను. అప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. ఒకటే రాష్ట్రం కదా. నా అంతట నేనే సామాజిక బాధ్యత తీసుకొని.. ఆ యాడ్ చేశాను. కానీ నాకు ఎవరో సీఎం చెప్పారని.. నేను చేయలేదు. ఇప్పుడు ఎవరైనా చెప్పిన చేస్తామని ఈయన తెలిపారు. అయితే ఈ విషయంపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది అయితే ఈ వివాదంపై సిద్ధార్థ్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
అపార్థం చేసుకున్నారు..
ఈ సందర్భంగా ఈయన క్లారిటీ ఇస్తూ కొందరు నేను చెప్పిన విషయాన్ని చాలా అపార్ధం చేసుకున్నారు. డ్రగ్స్ పై పోరాటం చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి నా పూర్తి మద్దతిస్తున్నా. మంచి సమాజం కోసం సినీ పరిశ్రమ ముందుకు రావాలనే సీఎం నిర్ణయం హర్షణీయం. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని ఈ సందర్భంగా ఈయన స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…