YS Sharmila: ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు విజయవాడలో ఎంతో ఘనంగా జరిగాయి. వయసు షర్మిల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు బట్టి విక్రమార్క వంటి వారందరూ కూడా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి కొనసాగించిన సంక్షేమ పథకాల గురించి ప్రస్తావనకు తీసుకువచ్చారు ఆరోగ్యశ్రీ 10820 మహాతరమైన కార్యక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చిన మహానేత రాజశేఖర్ రెడ్డి అంటూ ఆయన సేవలను కొనియాడారు. రాజశేఖర్ రెడ్డి గారు భౌతికంగా దూరమైన ప్రతి ఒక్కరి గుండెల్లో కొలువై ఉన్నారని తెలియజేశారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.2029లో షర్మిల ఏపీ సీఎం అవుతుందని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అలాగే కేంద్రంలో బిజెపి అధికారంలో ఉందని తెలిపారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
వ్యాపారం చేసేవాళ్లు వైయస్ వారసులు కాదు..
ఈ ముగ్గురు మోదీ పక్షమే అని, ప్రజల పక్షాన పోరాడబోయేది షర్మిల మాత్రమే అని అన్నారు. కడపలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని వార్తలొస్తున్నాయి, కడపలో ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటానని అన్నారు రేవంత్ రెడ్డి. వైఎస్ పేరుతో వ్యాపారం చేసేవాళ్లు వారసులు కాదు,
ప్రజల కోసం పోరాడేవాళ్లే వైఎస్ వారసులని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…