Actor Sri Ram : తమిళంలో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన శ్రీరామ్ తెలుగు, మలయాళంలో కూడా మంచి సినిమాలతో అభిమానులను ఆకట్టుకున్నాడు. మొదట 2002 లో వచ్చిన ‘రోజా కూట్టం’ అనే సినిమాతో తమిళంలో తన ప్రస్తానాన్ని ప్రారంభించాడు. అదే సినిమా ‘రోజాపులు’గా తెలుగులో అభిమానులను కూడా పలకరించాడు. తమిళ్ హీరో అయినప్పటికీ తెలుగు వారికి కూడా చాలా దగ్గరయ్యాడు.
షూటింగ్ మధ్యలో పారిపోయిన భూమిక…
ఒకరికి ఒకరు, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, దడ, సుప్రీం, లై, శ్రీనివాస కళ్యాణం, టెన్త్ క్లాస్ డైరీస్ వంటి సినిమాలలో నటించిన శ్రీరామ్ తనదైన నటనతో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇటీవల జీ5 లో ప్రసారం అయిన ‘రెక్కి’ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించారు. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
తనతో పాటు నటించిన నటీమణులలో భూమిక ది ప్రత్యేక స్థానం అని చెప్పుకొచ్చారు. తన మొదటి సినిమా రోజాపూలు తోనే భూమికతో నటించడం జరిగింది. అయితే ఆ సినిమాలోని పాట చిత్రీకరణ సమయంలో సెట్లో నుండి భూమిక చెప్పకుండా వెళ్ళిపోయిందని చెప్పారు. మూడు రోజుల తరువాత ఎయిర్ పోర్టులో కలిస్తే ఆ షూటింగ్ ఎలా జరిగింది అని నవ్వుతూ అడిగిందని, అప్పుడు చాకుతో పొడిచేయాలనిపించిందని చెప్పారు. ఈమధ్య తనని కలిసినప్పుడు ఈ విషయం గురించి నవ్వుకున్నాం అని, అయితే ఆరోజు తను నవ్వి ఉంటే ఇంకా కోపం వచ్చి ఉండేదని సరదాగా చెప్పుకొచ్చారు.
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…
ఇతిహాసాలలో ధర్మం, మానవత్వం గురించి చెప్పే గొప్ప ఉదాహరణల్లో ఒకటి రామాయణ యుద్ధం చివర్లో జరిగిన సంఘటనగా పండితులు పేర్కొంటారు.…
ఆంధ్రప్రదేశ్‌లోని పుణ్యక్షేత్రాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కుండలేశ్వర స్వామి క్షేత్రం భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలుస్తోంది. పవిత్ర గోదావరి…
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు కొత్త విషయం కాదు. అయితే కొంతమంది సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పటికప్పుడు…
ఆయుర్వేద ఔషధాల్లో ప్రముఖ స్థానం ఉన్న అశ్వగంధపై కేంద్ర సంస్థలు కీలక నిర్ణయం తీసుకోవడం ఆరోగ్య రంగంలో చర్చనీయాంశంగా మారింది.…