Senior Journalist Durga Kumar : ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయినా ప్రభుత్వాల మీద పక్క రాష్ట్రపు ప్రభావం పడుతూనే ఉంది. తాజాగా తెలంగాణ రాష్ట్రములో ముందస్తు ఎన్నికలకు కెసిఆర్ సై అన్నాడు. నవంబర్ 30న తెలంగాణ ప్రజానీకం వారికి కావాల్సిన నాయకుడికి వారి భవిష్యత్ కోసం ఓటు అస్త్రాన్ని ఉపయోగించుకున్నారు. అయితే ఎలక్షన్ ప్రచారాలు, హారాహోరి అన్నీ సద్ధుమణిగి ఇపుడు ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలయింది. ఫలితం రావడానికి కాస్త సమయమే ఉన్నా కాంగ్రెస్ దే గెలుపు, బిఆర్ఎస్ దే మరోసారి తెలంగాణ అంటూ సర్వేలు మొదలయ్యాయి. అయితే కాంగ్రెస్ వస్తుందనే ఎక్కువ ప్రచారం జరుగుతుండగా ఆ ప్రభావం ఏపీ రాజకీయాల మీద ఎలా ఉండనుందో సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ వివరించారు.
రేవంత్ సీఎం అయితే జగన్ పరిస్థితి అంతే…
దుర్గా కుమార్ గారు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి మాట్లాడుతూ తెలంగాణలో కెసిఆర్ కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది ఆంధ్ర రాజకీయాల మీద ముఖ్యంగా జగన్ ప్రభుత్వం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరించారు. ఎన్నికల వేళ కావాలనే సీఎం జగన్ కృష్ణ నీటి జలాల విషయంలో రాజకీయం చేసి తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ కి మేలు చేకూర్చేలా చేసినట్లయింది. ఈ విషయం అలాగే ఓటుకు నోటు కేసులో ఆల్రెడీ కెసిఆర్ మీద గుర్రుగా ఉన్న రేవంత్ రెడ్డికి ఇపుడు ఈ విషయంలో కూడా గుర్రుగా ఉన్నాడు.
ఇపుడు తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచి సీఎం అయితే మాత్రం జగన్ హైదరాబాద్ ఆస్తుల మీద ఖచ్చితంగా ప్రభావం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అదీ కాక రేవంత్ ముందు నుండి చంద్రబాబు విధేయుడు. అలా చంద్రబాబు, రేవంత్ ద్వారా ఎలాంటి మాస్టర్ ప్లాన్స్ వేస్తాడో వేచి చూడాలి అంటూ తెలిపారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం ఏర్పడుతుందో అది ఖచ్చితంగా ఏపీ రాజకీయాల మీద ప్రభావం చూపనుంది అంటూ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…