Singer Raghu Kunche : యాంకర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సీరియల్ నటుడుగా, సింగర్ గా వెయ్యికి పైగా పాటలు పాడిన సింగర్ రఘు కుంచె. ఈ మధ్య కాలంలో సినిమాల్లో విలన్ పాత్రలను చేస్తూ మెప్పిస్తున్నారు. ఇక రఘు కుంచె మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా పలు సినిమాలకు మ్యూజిక్ అందించి మెప్పించారు. ఇక తనతో పాటు సినిమాల్లో అవకాశాల కోసం వచ్చిన వారిలో రవితేజ, పూరీ జగన్నాథ్ వంటి వారు ఉన్నారు. అప్పటి వారి మధ్య జరిగిన జ్ఞాపకాలను పంచుకున్నారు రఘు కుంచె.
అలాంటి వారి వల్ల అవకాశాలు పోయాయి…
ఇండస్ట్రీలో చాలా మంది మనకు పరిచయం అయి అవకాశం ఇస్తామని చెప్పినా వారి చుట్టూ చేరే కొంతమంది వెధవలు నాకు అవకాశాలు రాకుండా చేసారంటూ రఘు కుంచె తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. మంచి ప్రాజెక్ట్స్ చేతికి వచ్చినట్టే వచ్చి పోయాయని చెప్పారు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో చాలా సార్లు ఏడ్చానంటూ చెప్పారు. సినిమాలో సాంగ్స్ అన్నీ నేనే కంపోజ్ చేసినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేరేవాళ్లతో చేయించుకుంటారు.
నేను అప్పటికే ఆ సినిమా కథకు సరిపోయే లాగా ఒక మ్యూజిక్ నా మైండ్ లో ప్రిపేర్ అయ్యింటాను కానీ నేను చేయలేనని వాళ్ళే డిసైడ్ చేసి నన్ను పక్కకు నెట్టేస్తారు అంటూ చెప్పారు. ఈ విషయంలో కొన్నిసార్లు సదరు సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్ ముందే ఏడ్చిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ముందు అవకాశం ఇస్తే కదా తెలుస్తుంది, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలా చేయగలనో తెలుస్తుంది. అదంతా చెప్పకుండా నావల్ల కాదని వాళ్ళే డిసైడ్ చేసినపుడు బాధగా అనిపిస్తుంది అంటూ చెప్పారు రఘు కుంచె.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…